॥ ఉన్నవి ॥
(౩6)
ఎదురు చూపులు నవ్వు కోసం వెదుకుతూనే
ఉన్నవి॥
గాయ మనసులు మౌన గీతం పాడుతూనే
ఉన్నవి॥
మదిసముద్రం దాచుకున్నప్రకటించని భావాలె
నిత్యజీవన స్రవంతిలోన తగులుతూనే
ఉన్నవి॥
ప్రకాసించు నీ కనులలో నాచూపుకు ఆశలె
గుండెలోతున కోరికలేవొ రేగుతూనె ఉన్నవి॥
మౌనించిన మనసులలో మాటలన్ని మూటలెగ
వెలుగుపంచు కవనాలుగ మారుతూనే ఉన్నవి॥
నింగికురిసి జలధభాష్పం పులకరించి మట్టికణం
హరితవర్ణపు తరువులన్నీ కులుకుతూనె ఉన్నవి ॥
మమకారము
మధుర'వాణి' ఒంపావుగ హృదిలొ
చైతన్యపు
ఆకాంక్షలె పొంగుతూనే ఉన్నవి ॥
......... వాణి కొరటమద్ది
No comments:
Post a Comment