Monday, 1 June 2015

|| నీకోసం ॥

చిరుదివ్వే తోడురాగ తచ్చాడుతు  నీకోసం ॥
కెరటాలే వెంటరాగ తారాడుతు నీకోసం ॥

జలనిధిలో గాలిస్తూ ఆచితూచి అడుగేస్తూ 
కోరుకుంటు నీస్పర్శలె వెతుకాడుతు నీకోసం ॥

చీకటంత మరుగౌవగ  వేకువనే మేల్కొపుతు 
చేరాలని నీజాడను తడబడుతూ నీకోసం ॥

ఏదేదో ఆలోచన ఎంతెంతో ఆవేదన 
గుబులెంతో గుండెలోన చింతించుతు నీకోసం ॥

రేయి లేదు జాము లేదు చెమరించే కనులెతోడు 
మౌనాలతొ మాటాడుతు గాలించుతు నీకోసం॥  

జాప్యమేల ప్రియతమా చేరరావ నాదరికి 
అడుగులెంత బరువైనా తిరుగాడుతు నీకోసం॥  

వినపడనీ 'వాణి'యలే కనపడనీ జాడలులే 
దిక్కులన్ని చూపులతో పరికించుతు నీకోసం॥  



...... వాణి 

No comments:

Post a Comment