॥ ఉన్నవిలే ॥
నీమాటల ముత్యములే తలపులలో ఉన్నవిలే !!
నీ స్పర్శల గిలిగింతలు ఊహలలో ఉన్నవిలే !!
నీ ఎడబాటు వేదనతో బేజారే మనసంతా
నీ అనుసృతి జ్ఞాపకాలు తపనలలో ఉన్నవిలే !!
మనసంతా హాయి హాయి నీ ప్రేమల గురుతులతో
చెప్పలేని దూరాలూ విరహంలో ఉన్నవిలే !!
గెలవలేక పోతున్నాను దూరాలే భారమౌతు
ప్రతీక్షణం మెలుకువలే వియోగంలో ఉన్నవిలే !!
మదినిండా కోరుకున్న మధుర'వాణి' ఆగమనం
హృదిగెలిచే సంతసాలు తనరాకలో ఉన్నవిలే !!
........ వాణి
No comments:
Post a Comment