నిశ్శబ్దాన్ని నేనేనని చెప్పాలని ఉంటుంది ||
మౌనంగా మాటలన్ని విప్పాలని ఉంటుంది ||
మౌనంగా మాటలన్ని విప్పాలని ఉంటుంది ||
విషాదాల నెలవులోన నిలవలేక పోతున్నా
అశ్రువులకు ఆకాంక్షలు అద్దాలని ఉంటుంది ||
అశ్రువులకు ఆకాంక్షలు అద్దాలని ఉంటుంది ||
జీవగయాత్ర ముగిసిపోతె తలవంచక తప్పదులే
చెలిమిగానె బ్రతుకంతా గడపాలని ఉంటుంది ||
చెలిమిగానె బ్రతుకంతా గడపాలని ఉంటుంది ||
ఓ పుష్పం మధుహాసం అందమైన ఆహ్లాదం
చిరునవ్వుల భాష్పంగా మిగలాలని ఉంటుంది ||
చిరునవ్వుల భాష్పంగా మిగలాలని ఉంటుంది ||
గాయమైత్రి నాదయినా గమనానికి బానిసనే
కవనంలో కలలన్నీ నింపాలని ఉటుంది |||
కవనంలో కలలన్నీ నింపాలని ఉటుంది |||
అక్షరమే నేనంతా దివ్యవాణి నా దంతా
మాధుర్యం భావనగా ఒంపాలని ఉంటుంది ||
మాధుర్యం భావనగా ఒంపాలని ఉంటుంది ||
.........వాణి, 06 Feb 17