నా ప్రియమైన నీకు ...
విరహమేమో కాని నీ సునితమనస్సు వెల్లడించే భావాలు నన్ను మరోలోకంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. నీ లేఖల్లో దాగుండిన నేను నీ హృదయ సామ్రాజ్యంలో విహరిస్తున్నా నన్ను నేను మరిచి మౌనమై ఓ కొత్త ప్రపంచం మనదై వెన్నెలలో సంచరిస్తుంటా ..
సంభాషించాల్సిన భావాలన్నీ మౌనక్షణాలు లెక్కించు కుంటున్నాయి. ఎదురుచూపుల భారాన్ని నేను మాత్రం మోయటం లేదా చెప్పు. ఊహల ఊసులు కలల కావ్యాలు మనసులోనే రచించుకుంటున్నాము కదా పలుకరింతల్ల్ల్లో ప్రేమ స్పర్శించలేక...దూరమైన మాటల్లొ నిరాశ దాగుడుమూతలు ఆడుతున్నా ..మాటల్ని ఓడిపొతూ మౌనాన్ని హత్తుకుంటూ...
ఏదో చెప్పాలని ఆశ.. గుండెల్లో దాచుకున్న భావాలన్నీ నీ మనసులో కుమ్మరించాలని... అలసిపొతున్నా.. అంతరంగంతో యుద్ధం అనివార్య మౌతోంది .నిశ్శబ్ద బందీలో.. నీ ఊహల ఊసులలో కాలం కరిగిపోతోంది , కనిపించని లోకమేదో కలలో కదిలిపోతోంది ...నీ జతలో నేను ఇంకి పొతూవున్నాను నేనేమిటో అర్ధం కాక.
భారమైన దూరాల మధ్య బందీలుగా మిగిలిపోయాం. అవసరాల జీవితంలో ఖైదీలుగా సాగిపొతున్నాం .మన ప్రమేయం లేని ఎడబాటు కాలం మౌన సందేశమై కరిగిపోతోంది సమయం .తనువుల దూరాన్ని తలచుకుంటూ స్పర్శల సాంగత్యం కావాలని మనసుల పెనవేసుకున్న మౌనమే మాటాడు కుంటొంది.జ్ఞాపకాల పుటలు విప్పుకుంటూ...అనుభూతుల అందాలు పంచుకుంటూ ..మనుగడకై పోరాటంలో జీవనయానం తప్పనిసరి కాసిన్ని జీతం రాళ్ళకై.,..
దూరాన్ని నిందిస్తూనే వున్నా...దగ్గరను దాసోహం కమ్మంటూ... నిరీక్షణకు నిట్టూర్పుల కానుకిస్తూనే వున్నా. ఎదురు చూపుకు కన్నీళ్ళను బహుమతినిస్తూ..... వచ్చి వెళ్ళి పొతావు హడావిడిగానే... ఉన్న కాసింత సమయంలోనే మమతల సంతకాలు నింపేసుకుని. రాబోయే క్షణాలకు తాయిలాలు దాచేసుకుని నిశ్శబ్ద ప్రయాణం నాదౌతుంది. మళ్ళీ మామూలే దూరాన్ని మోసుకుంటూ దగ్గరకై వేచి చూస్తూ ...
నిత్యమైన ఎదురుచూపుల్లో ...
అంతులేని అగాధాలెన్నో
అద్దాన్నికూడా ఏమార్చు కుంటోంది మనసు నీ కోసమే ...
నీ కనుపాపల్లో అర్థాలు ఆస్వాదించు కోవాలని
కాలాన్ని కసురుతూనే ఉంటున్నా లోకం మన దై కరిగిపోవాలని.
రెప్పలు కలవని రాత్రులే అన్నీ
వలపు సంతకాలతో నిండిన మాధుర్యపు జ్ఞాపకాలు లెక్కించు కుంటూ...
రేపటికి ఊతమవ్వాలని నీ ధ్యాసలోనే నన్ను నేను నడిపించుకుంటూ ... .
రేపటి ఆశల వారధి నిర్మించు కుంటూ .
అంతులేని అగాధాలెన్నో
అద్దాన్నికూడా ఏమార్చు కుంటోంది మనసు నీ కోసమే ...
నీ కనుపాపల్లో అర్థాలు ఆస్వాదించు కోవాలని
కాలాన్ని కసురుతూనే ఉంటున్నా లోకం మన దై కరిగిపోవాలని.
రెప్పలు కలవని రాత్రులే అన్నీ
వలపు సంతకాలతో నిండిన మాధుర్యపు జ్ఞాపకాలు లెక్కించు కుంటూ...
రేపటికి ఊతమవ్వాలని నీ ధ్యాసలోనే నన్ను నేను నడిపించుకుంటూ ... .
రేపటి ఆశల వారధి నిర్మించు కుంటూ .
అక్షరాల్లొ ప్రస్ఫుటించే ఆంతర్యాలెన్నో కదూ నువ్వై నాలో కరిగిపోతూ నెనై నీ లో ఇమిడిపొతూ ఎంతైనా అందంగా వుంది సుమా నీ లేఖ నన్నే చూసుకుంటున్నట్లుగా నీ దగ్గరగా నేనున్నట్లుగా.అక్షరాలు చేసే అద్భుతాలు కదూ. మనంగా ప్రకటించుకునే ఆనందాలు కదూ.. ఇంకెంత కొద్దిరొజులే మనసామ్రాజ్యాన్ని నిర్మించుకుని మనమై కలసిపొదాం ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంటూ .అంతవరకు అలసిపోని .అక్షరాలురాలుగా సాగిపోదాం ..
ఇలా కాసిన్ని వాక్యాలు ...
నీ... నేను
నీ... నేను
No comments:
Post a Comment