(1)
ఊరిలోని చెట్టుమీద
ఉదయించిన కిరణాలూ
తొలిపొద్దుల ఉత్సాహం
వేకువతెర తీసింది
(2)
బ్రతుకుయాత్ర మొదలైనది
జీవితమే నాటకమై
చిక్కుకుంది కాలమంత
ధనరక్కసి కోరల్లో
(3)
తరగతిలో బాల్యమంత
చిధ్రమౌతు చిరునవ్వులు
పసితనమతి భారమయ్యె
చిలిపితనం చెరిగిపోతు
(4)
సమాజమే కలుషితమై
మానవత్వం మరుగౌతూ
అనుబంధపు ఆనవాళ్ళు
గోడలపై చూడాలీ....!!
......వాణి, 05 Feb 17
No comments:
Post a Comment