కలానికే కొత్తందం రచనలోని వెలుగురేఖ ||
ఙ్ఞాపకాల భావాలే ఆత్మలోని వెలుగురేఖ ||
ఙ్ఞాపకాల భావాలే ఆత్మలోని వెలుగురేఖ ||
పెదవులపై అలిగాయా మదిలోతుల హసితాలు
ఆశపడ్డ ఆనందం మనసులోని వెలుగురేఖ ||
ఆశపడ్డ ఆనందం మనసులోని వెలుగురేఖ ||
అందమైన అనుభూతులు మాలగుచ్చి మురిశానా
అల్లుకున్న బంధాలవి పదములోని వెలుగురేఖ ||
అల్లుకున్న బంధాలవి పదములోని వెలుగురేఖ ||
ఓటములెన్నైనా అవి అనుభవాల పరిచయమే
సాధించే సంకల్పం బ్రతుకులోని వెలుగురేఖ ||
సాధించే సంకల్పం బ్రతుకులోని వెలుగురేఖ ||
స్వప్నాలకు స్వాగతాలు కునుకులేని అలజడిలో
చీకటిపై దండయాత్ర తలపులోని వెలుగురేఖ ||
చీకటిపై దండయాత్ర తలపులోని వెలుగురేఖ ||
శిధిలమౌతు నిట్టూర్పులు నిర్ధయగా మిగిలాయి
మౌనమైన చూపుభాష కంటిలోని వెలుగురేఖ ||
మౌనమైన చూపుభాష కంటిలోని వెలుగురేఖ ||
చింతఏదొ గుండెల్లో చితిమంటగ తచ్చాడెను
మధురవాణి వినిపించెను చెలిమిలోని వెలుగురేఖ ||
మధురవాణి వినిపించెను చెలిమిలోని వెలుగురేఖ ||
.......వాణి, 01 Feb 17
No comments:
Post a Comment