నాకు నచ్చిన కవిత ........
తాతినేని వనజ గారు రాసిన " దు:ఖం కావాలనిపిస్తుంది "
కవితా శీర్షిక చూడగానే ఆసక్తిగా అనిపించింది." దు:ఖం కావాలనిపించడం ఏంటా?" అని ప్రశ్న!
ఎవరూ ధు:ఖాన్ని కావాలని కోరుకోరుగా, ఒకసారి చదివా, మళ్ళీ చదవాలనిపించేలా వుంది
ఎవరూ ధు:ఖాన్ని కావాలని కోరుకోరుగా, ఒకసారి చదివా, మళ్ళీ చదవాలనిపించేలా వుంది
"చెప్పలేని దిగుళ్ళు ఏవో కమ్ముకొస్తుంటాయి
మోడు మీద మొలిచే చిగురుల్లా
రుచించని వాక్యాలేవో నెట్టుకుంటూ వస్తుంటాయి"
మోడు మీద మొలిచే చిగురుల్లా
రుచించని వాక్యాలేవో నెట్టుకుంటూ వస్తుంటాయి"
దు:ఖం అనేది పోగొట్టడం అంత సులభం కాదు. ఎన్ని అనునయపు మాటలు ఎంత చెప్పినా, మోడు మీద మొలిచిన చిగురాకులానే వుంటాయి. ఎంతకి అర్ధం కావు ఎదుటివారు చెప్పే మాటలు. అనుభవించే వారికి కదా తెలిసేది అనే నిరుత్సాహమే వుంటుంది వారిలో..
నన్ను నేను సేద తీర్చుకోడానికట, లోపలి దుఖాన్ని చేద అరువుతీసుకుని తోడుకోవాలని, ఎన్ని ఆరాటాలని, పోరాటాలని, మాటెసిందో... అంటారు
కనురెప్పల మాటున కోల్పోయిన స్వప్నాలేగా మనకి దు:ఖాన్ని తెప్పిస్తాయి.
కనురెప్పల మాటున కోల్పోయిన స్వప్నాలేగా మనకి దు:ఖాన్ని తెప్పిస్తాయి.
"బహుశా వారికి తెలిసి ఉండదు
దుఃఖపు నదిని ఈదటం ఎలాగో అన్నది
దేవుడిపై నింద వేసేసి.. తీరిగ్గా దుఃఖిస్తూ ఉండేవారు"
దుఃఖపు నదిని ఈదటం ఎలాగో అన్నది
దేవుడిపై నింద వేసేసి.. తీరిగ్గా దుఃఖిస్తూ ఉండేవారు"
మన పెద్ద వాళ్ళు అంటూ వుంటారు ఇప్పటికీ.., కర్మ ఫలమే దు:ఖం అని,కన్నీళ్ళే దేవుడు నా నుదుటన రాశాడంటూ.. ఆ ముక్క ఇల చెపుతూ
మా అక్కలు, మేనత్తలు,వారి మేనత్తలు అందరూ అంటూ ఉండేవారు అంటారు.
దు:ఖం ఎలాంటిదైనా ఆ సమయంలో దేవుడినే తప్పు పడతాం. ఆ రాత ఆయనే రాశాడంటు..
మా అక్కలు, మేనత్తలు,వారి మేనత్తలు అందరూ అంటూ ఉండేవారు అంటారు.
దు:ఖం ఎలాంటిదైనా ఆ సమయంలో దేవుడినే తప్పు పడతాం. ఆ రాత ఆయనే రాశాడంటు..
నాకుదుఃఖాల వారసత్వాలని మోయాలనిలేదు అంటూనే
తాగడానికి పనికొచ్చే నదిని దాటేశాను ఉప్పునీటి సముద్రాన్ని దాటడాన్ని సవాల్ గా తీసుకుంటానంటారు
తాగడానికి పనికొచ్చే నదిని దాటేశాను ఉప్పునీటి సముద్రాన్ని దాటడాన్ని సవాల్ గా తీసుకుంటానంటారు
మన మన్సుల్లో కల్మషం లేనపుడు బాదలో వున్న ఎదుటి వాళ్ళని అర్ధo చేసుకోగలం. దు:ఖం, రంగన్నా ఇస్ఠం అంటారు, కన్నీళ్ళు స్వచ్చంగా వుంటాయి, అందుకేనేమో అలా అంటారు హృదయ కల్మషాన్ని కడిగేసుకోవాలని వుందని.
అయినా, మనమూ ఎప్పుడైనా మనసులో బాద కలిగినపుడు కాసేపు ఏడ్చేసి ఉపశమన పొందుతాం. ఆమె ఈ కవితని ఎదుటి వారి దు:ఖం పోగొట్టాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో రాశారు చివరగా ఆవిషయం మనకి అర్ధo అవుతుంది.
మంచి కవితను అందించిన తాతినేని వనజ గారికి హృదయపూర్వక దన్యవాదాలు.
ఆ కవితను మరొక్కసారి ఇక్కడ.....
|| దుఃఖం కావాలనిపిస్తుంది ||
ఎవరికైనా ఇంతేనా ...
చెప్పలేని దిగుళ్ళు ఏవో కమ్ముకొస్తుంటాయి
మోడు మీద మొలిచే చిగురుల్లా
రుచించని వాక్యాలేవో నెట్టుకుంటూ వస్తుంటాయి
రాపిడితో గొంతుమండిస్తున్నాసరే
కాస్త దుఃఖం కావాలనిపిస్తుంది
నన్ను నేను సేదదీర్చుకోవడానికి
దుఃఖాన్నితోడుకోవాలి
చేద అరువు తీసుకునయినా
ఎంతకీ రాని దుఃఖం ..
ఎన్ని ఆరాటాలని,పోరాటాలని మాటేసిందో..
కనురెప్పల మాటున ఎన్ని స్వప్నాలని కాజేసిందో ..
మా అక్కలు, మేనత్తలు,వారి మేనత్తలు
అందరూ అంటూ ఉండేవారు
మన నుదుటిమీద దేవుడు దుఃఖాన్ని రాసిపెట్టాడని
బహుశా వారికి తెలిసి ఉండదు
దుఃఖపు నదిని ఈదటం ఎలాగో అన్నది
దేవుడిపై నింద వేసేసి.. తీరిగ్గా దుఃఖిస్తూ ఉండేవారు
దుఃఖాల వారసత్వాలని మోయాలనిలేదు నాకు
అయినా దుఃఖం కావాలనిపిస్తుంది
నదిని ఈదిన నన్ను సముద్రం సవాల్ చేస్తుంది
సవాళ్లు ఎదుర్కోవడమన్నా, దుఃఖం రంగన్నా
నాకిష్టం అయినందుకేమో
దుఃఖాన్ని ప్రేమగా హత్తుకొవాలనిపిస్తుంది
హృదయ కల్మషాలని కడిగేసుకోవాలనిపిస్తుంది
అవును ... నాది కాని నిలువెత్తు దుఃఖాన్ని
ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. దుఃఖం కావాలనిపిస్తుంది
( తన కోసం కాకుండా ఇతరుల కోసం దుఃఖించేందుకు మనసుండాలి అన్న వ్యాఖ్య కి స్పందనగా )

.....తాతినేని వనజ with Vanaja Tatineni
No comments:
Post a Comment