సందడి చేసే అక్షరాల సంపద ఇది ....
నా మనసు చెప్పిన మాటలు .....
సడిచేయని (అ) ముద్రితాక్షరాలు.... Manju Yanamadala
సడిచేయని (అ) ముద్రితాక్షరాలు.... Manju Yanamadala
మనసు అన్వేషణ మౌనంగా సాగిపొతుంది మనిషి జీవితంలో ఎదుర్కొనే ఒడుదుడుకులు ఎన్నో... అంత:సంఘర్షణ అక్షరీకరించడం అందరూ చెయ్యలేక పోవచ్చు ఒక్కోరిది ఒక్కోరకమైన ప్రయాణం.
సమాజాన్ని తట్టి లేపినా ..జ్ఞాపకాన్ని ఒడిసి పట్టినా అలతి పదాలలో ప్రకటించడం మంజు నేర్పరితనం. తన కవిత్వంలో లోతైన భావాన్ని అలవోకగా అల్లేయడం కనిపిస్తుంది.
అక్షరానికి ఊపిరి పోసిందేమో జీవితాన్నిచ్చింది
భారమంతా భావమై కురిసిందేమో బ్రతుకు బావుటా ఎగరేసింది
ఓటమికి విజయతిలకం దిద్దేసి వేదనకు వెన్నెలమరకలద్దేసి
కాలానికి కన్నీటిని కానుకగా ఇచ్చి
వేకువను మెలువనుకుని నమ్మకానికి చిరునామాను రచించింది
భారమంతా భావమై కురిసిందేమో బ్రతుకు బావుటా ఎగరేసింది
ఓటమికి విజయతిలకం దిద్దేసి వేదనకు వెన్నెలమరకలద్దేసి
కాలానికి కన్నీటిని కానుకగా ఇచ్చి
వేకువను మెలువనుకుని నమ్మకానికి చిరునామాను రచించింది
అక్షరాల సాక్షిగా నేనోడిపొలేదంటూ .... వొచ్చిన మొదటి పుస్తకం అద్భుత రచనగా నిలిపొయింది...
ఇప్పుడు తన నేస్తంతో చెపుతున్నట్లుగా ...రాసిన లేఖలు అందరినీ తన నేస్తాలుగా పలుకరిస్తూ సాగిన వ్యాసాల పరంపర అందరితొ ముచ్చట్లు చెపుతాయి ...సడి చేెయవు అక్షరాలంటూ ... తన అముద్రిత అక్షరాలను ముంద్రించి సందడి చెయించారు.
స్నేహానికి మంజు ఇచ్చే ప్రాధాన్యత ఈ పుస్తకంలో ముందు పేజీ నుంచే కనిపించింది తన ఈ పుస్తకాన్ని చిన్ననాటి స్నేహితులు " వాసు వేదుల" గారికి అంకితమివ్వడం ఆమె గొప్ప మనసుకు తార్కారణం ..చదువులో పోటి పడ్డ స్నేహితుడు మరణంలో సైతం తానే గెలిచానని స్వర్గంలో వున్న నేెస్తానికి అంకిత మిచ్చారు
పుస్తకంలొ కొస్తే .... నైరాశ్యాన్ని నిరసించే రచన అన్న మండలి బుద్ధ ప్రసాద్ గారి మాట అక్షరసత్యమనిపిస్తుంది.
ముందుమాటలు చదివాక ముందు లోపలి పేజీలు చదవాలనే ఆసక్తి కలిగిస్తాయి పుస్తకం సాంతం వ్యాసాల పరంపర సడి చేయని అక్షరాల సంపద.
నువ్వే చెప్పు ఏం చేయాలో. అంటూ... ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు తన నేస్తంతో చెప్పుకున్న ఈ కబుర్లన్నీ ఎవరికీ వారు తమకే చెపుతున్నట్లుగా భావిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేలా..చదివితీరాల్సిన సడి చేయని అందమైన అక్షరాలు .
సందేహాలు, సందేశాలు ,సమస్యలు, సమాధానాలు ఇలా కొనసాగిన అక్షర ప్రయాణం.... ఇది
ఇంకా విదేశీ సంస్కృతి మోజులో మనమెంతలా కూరుకు పొయామో కదా ..! ఈ మాటలు అద్దం పడుతున్నాయి.
“ ఇప్పటికి మన మీద గెలుస్తున్నది తెల్లవాడే... మన సంప్రదాయపు పండగల కన్నా మన అందరికి గుర్తుండే పండుగ న్యూ ఇయర్... మనం ఇష్టపడే దుస్తులు జీన్స్... మాతృభాష కన్నా మనకు బాగా వచ్చిన భాష ఇంగ్లీష్...ఈ పదాలు తెలుగులో చెప్పినా అర్ధం కాని వారు ఎందరో.. అందుకే మనం ఎంతగా పరాయితనంపై మక్కువ పెంచుకున్నామో చెప్పడానికే ఈ ఉదాహరణలు...
విశిష్టమైన మన మత గ్రంధాల కన్నా మనకు తెలిసిన ముఖ పుస్తకమే ఎక్కువ ఇష్టం...బానిసత్వం నుంచి విముక్తి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటికీ పరాయి తత్వానికి బానిసలుగా చేసుకున్న తెల్లవాడే గెలిచాడు మన మీద...”
నిజాన్ని ఒప్పుకోడం కష్టమే మరి ....
భగవంతుడినే నిందిస్తున్నాను అనే వ్యాసంలో దేవుడు స్వార్ధపరుడంటు
తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటే అమ్మ కష్టం ఆడదాని విలువ తెలిసేది .. ఉమ్మనీళ్ళు ఎలా ఉంటాయో.. ఆ కష్టం ఏమిటో తెలిసేది.
తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటే అమ్మ కష్టం ఆడదాని విలువ తెలిసేది .. ఉమ్మనీళ్ళు ఎలా ఉంటాయో.. ఆ కష్టం ఏమిటో తెలిసేది.
ఎందుకో అనుకుంటాం....కదూ ...!! నేనైతే దేవుడిని నిలదిస్తాను కూడా ....
ఈ వాక్యాలు చాలవు .. ఈ పుస్తకాన్ని ఆసక్తిగా చదవాలనిపించడానికి ......
ఈ వాక్యాలు చాలవు .. ఈ పుస్తకాన్ని ఆసక్తిగా చదవాలనిపించడానికి ......
అహంకారం .. ధన దాహంతో రోజులు బిజీగా గడిచి పోతున్నాయి , నిజమైన అనుబంధాల విలువల రుచి మరిచి పోతున్నాము.నిత్య సంఘర్షణల మధ్య ఆత్మీయస్పర్శను కుడా అనుభవించలేని అంధకారంలో గడిపేస్తున్నాం. చుట్టూ మనుష్యులు వున్నా ఒంటరితనం వెంటే వుంటోంది .
నలుగురితో కలసి గంజితాగినా రుచిగా వుండదా..? ఎన్ని కోట్లు సంపాదించినా అమ్మ పెట్టే ముద్ద కమ్మదనం ముందు దిగదుడుపే కదా...!
అంతిమ ప్రయాణం గురించి చెప్పిన మాటలు ఇలా …
ఒక్క మనం తప్ప అందరు చూడగలరు అది.. ఈ ప్రపంచంతో బంధాలను వదిలించుకుని సాగే ప్రయాణం అదే అంతిమ యానం. జీవితానికి చిట్ట చివరి మజిలీ అని , అప్పటి వరకు మనతో ఉన్నదేది మనతో రాదంటూ మనకిచ్చే కన్నీటి వీడ్కోలు మనం చూడలేనిది, ఆఖరి ప్రయాణపు అంతర్మదానాన్ని జీవి తెలుసుకునే భాష ఇంకా రాలేదు. అంటున్న ఈ మాటలు ఆలోచింప చేస్తాయి.
కలుషితమైంది పర్యావరణమా!! మనమా...!!
నిజమే ఆలోచించిల్సిందే ....మానవ సంబంధాలే కలుషితమయ్యాయి ...మనుగడ కావాలనుకున్న మనిషే స్వార్ధాన్ని అందలమెక్కించాడు... ధన దాహంతో మానవత్వాన్నే మంట గలుపుతున్నాడు ....నాలుగు ముక్కల్లో కుండ బద్దలు కొట్టిన ఈ వ్యాసం ఆలోచింప చేస్తుంది.
ప్రేమ ....పెళ్ళి...
కన్నవాళ్ళను కన్నీళ్ళు పెట్టించి అన్నీ తుంచుకున్న తమదైనదనుకున్న జీవితం పంచుకునే వారులేని ప్రశ్నార్ధక పయనం కాదా ...ఒక్కసారైనా గుర్తుపెట్టుకోమంటుంది ఈ వ్యాసం...
సమాధానం తెలియక....
ఆది అంతాలు తెలియని జీవితం ఆలోచించడం మొదలెట్టాక సందేహంగానే వుంటుంది కదూ... బాధ్యతల నిర్వర్తించడం కోసం ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ జీవన ప్రయాణం సాగిస్తూ వుంటాం అది అందరికీ తప్పని పరిస్దితి.
ఆత్మహత్యలు ..ఎందుకు ...
ఏ జీవికీ లేని ఆలోచనా శక్తి మనిషికే సొంతమయ్యింది తమకు తెలిసిన భాషలో మాట్లాడుకునే అవకాశం మనిషికి మాత్రమే సాధ్యమైయింది.
మనకు తెలియక ఎదురయ్యాయో... మనతప్పుకు మనకు ఎదురయ్యే శిక్షనో ...బాధ అనుభవించడం తప్పని పరిస్ధితి సమస్య మొదలయ్యాక సమాధానం దొరక్క పోదు ఆత్మహత్యలు పిరికితనం అన్న ఈ వ్యాసం సంఘర్షణకు స్వాంతన నిస్తుంది
నాకూ ఙ్ఞాపకాల నిండా గాయాలే ఆత్మ విశ్వాసాన్ని మంజు అక్షరాల నుండే నేర్చుకున్నాను
ఇదేగా జీవితం గతం గాయంగా మిగిలిందో ఆత్మీయతలు అద్దుకుందో అంతరంగం మాత్రం జ్ఞాపకాల కావ్యాన్ని రచిస్తోంది చెమరించిన దృశ్యాలన్నీ కావ్యాలై మిగులుతున్నాయి ...
అందరి మనసుల్లో ఆత్మీయంగ మిగిలిపోయిన సిరివెన్నెల గారి పాట మనసు పెట్టి విన్నప్పుడు తమ జీవితాన్ని గుర్తు చెసుకోకుండా వుండలేము ..." జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది ..." నిజమనుకోక తప్పని నిజం ఇది.
మార్పు కోసం ఎదురుచూస్తూ సాగుతున్న జీవితాన్ని మౌనంగానె మొస్తున్నాం కదూ...ఇవన్ని మంజుమాటలే నేనూ ఇలానే అనుకున్నా .. మీరూ అంతే అనుకుంటారు.
మంజు మనసు ముచ్చటే ఇది కూడా.. కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు మన మనసే కనిపిస్తుంది చెమ్మగిల్లిని కన్నులు గుండెను తడుముకుంటాయి ..ఖచ్చితంగా అలానే అనిపించేె ఈ కబుర్లు మీరూ చదవండి ... ఊరడించే అక్షరాలూ ఇక్కడె దొరుకుతాయి కాస్తయినా మనసును ప్రక్షాళన చేసుకోవచ్చు ..
ఇలాంటి వ్యాసాలు 150కి పైగా....ప్రతీది ప్రత్యేకంగా మొదలు పెడితే చివరిదాకా చదవాలనే ఆసక్తి కలిగిస్తాయి.
స్నేహం గురించో.... , జ్ఞాపకాల నిధుల నుంచో... .అన్నీ తానై మనసుతో పడ్డ సంఘర్షణ. నిజాలు నిక్కచ్చిగా చెపుతూ .. అనునయించే అక్షరాలు ..
మానవతా విలువలు ..అనుబంధాల ఆప్యాయతలు ఇలా ఈ వ్యాసాల పరంపర .
ఆత్మీయ స్నేహితురాలు మంజుగారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరిన్ని పుస్తకాలు తన నుండి ఆశిస్తూ ..
.........వాణి కొరటమద్ది, 24 Jan 17
No comments:
Post a Comment