తడి ఙ్ఞాపకం....
చూరుకు వేలాడే చిరునవ్వులు
నేడు చితికిపోయిన ఆనందాలు
నేడు చితికిపోయిన ఆనందాలు
గాయపడ్డ జీవన చిత్రాలే
గతితప్పిన బ్రతుకు యాత్రలు
గతితప్పిన బ్రతుకు యాత్రలు
అందమైన అతియోక్తులేవీ
మనసును స్పర్శించడంలేదు
మనసును స్పర్శించడంలేదు
అరుదైన సంఘటనలేవి
సంతోషాన్నివ్వడంలేదు
సంతోషాన్నివ్వడంలేదు
నిరంతర ప్రశ్నలకు
నిట్టూర్పులే సమాధానాలు
నిట్టూర్పులే సమాధానాలు
నిత్యమైన చీకటి వెలుగులకు
ఙ్ఞాపకాలే ఆధారాలు
ఙ్ఞాపకాలే ఆధారాలు
నిశలు రాల్చే ఆలోచనలు
నిశ్శబ్ద భావనలుగా
మనసు తడులు
అక్షరాలను అన్వేషిస్తున్నాయి....!!
నిశ్శబ్ద భావనలుగా
మనసు తడులు
అక్షరాలను అన్వేషిస్తున్నాయి....!!
....మేలుకొలుపు.....
నిశిధి వేదికపై పసిడివర్ణమై పులకించిన ఆకశం
విహంగాల రంగులతో వన్నెలద్దుకున్న ప్రభాత పరిచయం
విహంగాల రంగులతో వన్నెలద్దుకున్న ప్రభాత పరిచయం
చీకటి మరకలు చెరిపేస్తూ
వేకువ తలుపు తెరుచుకుంటూ
రెక్కలు విచ్చుకున్న ఉషోదయాలు
ఊపిరి పోసుకుంటున్న ఊహలు
నులివెచ్చని కిరణస్పర్శలు
ఆహ్లాదమైన ఆనందాలు
వేకువ తలుపు తెరుచుకుంటూ
రెక్కలు విచ్చుకున్న ఉషోదయాలు
ఊపిరి పోసుకుంటున్న ఊహలు
నులివెచ్చని కిరణస్పర్శలు
ఆహ్లాదమైన ఆనందాలు
రేతిరి తలపుల తడి
స్పర్పిస్తున్నది ముసి ముసిగా
వెలుతురు ఉనికిని వెతుకుతోంది మది
ఆశల నావలో పయనించాలని
స్పర్పిస్తున్నది ముసి ముసిగా
వెలుతురు ఉనికిని వెతుకుతోంది మది
ఆశల నావలో పయనించాలని
పక్ష్యులు చుట్టాలై వస్తుంటే
చిరునవ్వుల ఆహ్వానాలు
నిశ్శబ్దం తుడిచేస్తు
భానుడికి మేల్కొపులు
కొత్తరోజు కొత్తఅందాలు
చిరునవ్వుల ఆహ్వానాలు
నిశ్శబ్దం తుడిచేస్తు
భానుడికి మేల్కొపులు
కొత్తరోజు కొత్తఅందాలు
ప్రణమిల్లుతున్నా ప్రకృతికి
ప్రశాంతమవనిమ్మని జీవన జాగృతి.....!!
ప్రశాంతమవనిమ్మని జీవన జాగృతి.....!!
నిర్జీవితం.........
....
కలవరాలన్నీ కడతేరిపోనివే అయినా
చెరిపేసిన కన్నీళ్ళన్నీ పమిట కొంగులో
ఇంకి పోతున్నాయి
కలవరాలన్నీ కడతేరిపోనివే అయినా
చెరిపేసిన కన్నీళ్ళన్నీ పమిట కొంగులో
ఇంకి పోతున్నాయి
ఆత్మీయస్పర్శలేవీ అర్ధం కాలేదు
అపద్దం తొడిగిన నిజంలా
అపద్దం తొడిగిన నిజంలా
చూపుల ఆస్వాధనలో నటనలెన్ని లెక్కించలేదు
అలుసైపోయిన ఆడతనం
అనాదిగా అంతుతెలియని వాస్తవం
అలుసైపోయిన ఆడతనం
అనాదిగా అంతుతెలియని వాస్తవం
చెక్కుకునే నవ్వుల్లో
చీకటి సంతకాలెన్నో
చీకటి సంతకాలెన్నో
సాక్ష్యంలేని గాయాలకు
మౌననివేదనలే సాంతం
మౌననివేదనలే సాంతం
విదిల్చిన చేతులే వెంటాడి చేసిన గాయాలెన్నో
ఆత్మవిశ్వాసాన్ని తొక్కి
ఓదార్పు వాకిట్లో వేలాడ దీసిన సమర్దింపు సాహసాలెన్నొ
ఆత్మవిశ్వాసాన్ని తొక్కి
ఓదార్పు వాకిట్లో వేలాడ దీసిన సమర్దింపు సాహసాలెన్నొ
ప్రాకులాడే పరువాటలో బలిపశువులై
చెమర్చే కన్నీటి చుక్కల్లో
ఓడిపోతున్న వనిత తలరాతలు
చెమర్చే కన్నీటి చుక్కల్లో
ఓడిపోతున్న వనిత తలరాతలు
గాయాన్ని గుండెలపై మోస్తూ
గమనానికి రంగులద్దుతుంది
అశ్రులులను అంకితమిచ్చేసి
నిశ్శబ్దంలో నిర్జీవితం
గమనానికి రంగులద్దుతుంది
అశ్రులులను అంకితమిచ్చేసి
నిశ్శబ్దంలో నిర్జీవితం
అతుకులు వేసుకుంటూ
రేపటిపై కొత్తరాతను వెతుక్కుంటుంది
అద్దంలో కనిపించే తనే
తను కాదనుకుంటూ
నిజం చరిత్రలో ఇంకి పోనివ్వమంటూ..!!
రేపటిపై కొత్తరాతను వెతుక్కుంటుంది
అద్దంలో కనిపించే తనే
తను కాదనుకుంటూ
నిజం చరిత్రలో ఇంకి పోనివ్వమంటూ..!!
ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు వార్తల్లో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం...
ఏమిటిది ఇంకా అంతు చిక్కని మౌన రణం
మనసును సవరించలేని అంతర్యుధ్ధం
... కాలం వెళ్ళదీస్తూ...
ముసలి తనం శాపమై
నిర్వేదంతో నిండిపోయి
గుండె ఆగి పోక
బ్రతుకును మోయలేక
శాపగ్రస్త మయ్యింది
నిర్వేదంతో నిండిపోయి
గుండె ఆగి పోక
బ్రతుకును మోయలేక
శాపగ్రస్త మయ్యింది
చూపుకందని దృశ్యాలు
చేవలేని చేతలు
నడుము బరువై
నడక భారమై
గమ్యాలు దూరమై
అంతిమం అందక
అంతులేని వేదన
చేవలేని చేతలు
నడుము బరువై
నడక భారమై
గమ్యాలు దూరమై
అంతిమం అందక
అంతులేని వేదన
నోచుకోని ఆత్మీయతలు
నిత్యమైన నిర్లక్ష్యాలు
ఉబికే కన్నీళ్ళు
సత్తువ కోల్పోయిన శరీరాలు
నిత్యమైన నిర్లక్ష్యాలు
ఉబికే కన్నీళ్ళు
సత్తువ కోల్పోయిన శరీరాలు
ప్రశ్నిస్తే ఆశ్రమాలు పిలుస్తాయి
అడిగితే నీడలు దూరమౌతాయ్
బలవంతపు బ్రతుకులు
కాలాన్నిచూస్తూ.....
కాలం వెళ్ళదీస్తూ...!!
అడిగితే నీడలు దూరమౌతాయ్
బలవంతపు బ్రతుకులు
కాలాన్నిచూస్తూ.....
కాలం వెళ్ళదీస్తూ...!!
...నిశ్శబ్ద యుద్ధం ....
ఏమిటిది ఇంకా అంతు చిక్కని మౌన రణం
మనసును సవరించలేని అంతర్యుధ్ధం
విజయానికి దారే లేని ముగింపు అది
సర్ది చెప్పుకోలేని సంకటాలే అవి
దారి తెలియని మనసుకు
అంతర్వేదన అవసరమైపోతోంది
ఓదార్చుకునే ఓర్పును కోల్పోంది
సర్ది చెప్పుకోలేని సంకటాలే అవి
దారి తెలియని మనసుకు
అంతర్వేదన అవసరమైపోతోంది
ఓదార్చుకునే ఓర్పును కోల్పోంది
ఙ్ఞాపకమా కాసేపు ఆగవమ్మా
కన్నీటిని ఆరనీవమ్మా.....
కన్నీటిని ఆరనీవమ్మా.....
ఎంతని బ్రతిమాలను..
గుర్తులు గాయపడ్డాయి
గుండెల్లో గగ్గోలు పెడుతున్నాయి
గుండెల్లో గగ్గోలు పెడుతున్నాయి
అనివార్యమైన నిశ్శబ్ద యుద్ధం
భావంలో బందీ అయిపోయింది
భావంలో బందీ అయిపోయింది
నిన్నల్ని నిక్షిప్తం చేస్తూ
నేటికీ నడకను శ్వాసిస్తూ
వర్తమానానికి రంగులద్దుకుంటోంది
నేటికీ నడకను శ్వాసిస్తూ
వర్తమానానికి రంగులద్దుకుంటోంది
ఊహలజగతి ఉనికి వెతుక్కుంటూ
ఆశల ఆచూకి అంతుతెలుసుకుంటూ
కలంలో నిక్షిప్తమైన అంతరంగం
క్షణ క్షణం అక్షరమై ప్రయాణిస్తుంది.....!!
|| అక్షరమైత్రి ||
ఆశల ఆచూకి అంతుతెలుసుకుంటూ
కలంలో నిక్షిప్తమైన అంతరంగం
క్షణ క్షణం అక్షరమై ప్రయాణిస్తుంది.....!!
చీకటి ఆశ....
సన్నగిల్లిన మది స్ధాణువై
మౌన సంగీతాన్ని వినిపిస్తూనే వుంది
మౌన సంగీతాన్ని వినిపిస్తూనే వుంది
గతమైపోయిన గాయాలు
ముళ్ళై గుచ్చుకుంటూ
జాలి మాటలు చేదు స్వరాలై
గగనం గంభీరమై
గమ్యానికి బాటలు చూపిస్తున్నది
ముళ్ళై గుచ్చుకుంటూ
జాలి మాటలు చేదు స్వరాలై
గగనం గంభీరమై
గమ్యానికి బాటలు చూపిస్తున్నది
నాటి గాయల వెక్కిళ్ళు
నేడు ఙ్ఞాపకాల కన్నీళ్ళు రాలుస్తూ
శిధిల బంధాలను ఏకరువు పెడుతున్నాయి
నేడు ఙ్ఞాపకాల కన్నీళ్ళు రాలుస్తూ
శిధిల బంధాలను ఏకరువు పెడుతున్నాయి
తుది దుప్పటి కప్పుకున్నాక
నాదన్నది ఏమి లేదన్నది కూడా
తెలియని అచేతన స్ధితిలో
ఆశల బ్రతుకు
అనుబంధాలకై ఆరాట పడుతూనే వుంటోంది
నాదన్నది ఏమి లేదన్నది కూడా
తెలియని అచేతన స్ధితిలో
ఆశల బ్రతుకు
అనుబంధాలకై ఆరాట పడుతూనే వుంటోంది
కొడిగట్టె ప్రాణి కూడా
కోరికల చిట్టా విప్పుతూ
అంతిమ ఘడియలు కూడా
ఊపిరికై ఉరకలు వేస్తూనే వుంటాయి
కోరికల చిట్టా విప్పుతూ
అంతిమ ఘడియలు కూడా
ఊపిరికై ఉరకలు వేస్తూనే వుంటాయి
ప్రతి జీవిత చిత్రంలో
కాలగర్భంలో కలిసిపోయే క్షణాలన్నిటిలో
దుఃఖాన్ని సవరించుకున్న సందర్భాలు వుండే వుంటాయి
కాలగర్భంలో కలిసిపోయే క్షణాలన్నిటిలో
దుఃఖాన్ని సవరించుకున్న సందర్భాలు వుండే వుంటాయి
చీకటిలో చింతలు
ఓటమి అనుభవాలు
విజయానికి చేరువ చేసే వుంటాయి
ఓటమి అనుభవాలు
విజయానికి చేరువ చేసే వుంటాయి
కదంతొక్కిన కన్నీళ్ళు
సంకల్ప మనసుతో సావాసం చేస్తూ
నిన్నటి కలలకు
కొత్తఆశల దీపాలు వెలిగిస్తాయి
సంకల్ప మనసుతో సావాసం చేస్తూ
నిన్నటి కలలకు
కొత్తఆశల దీపాలు వెలిగిస్తాయి
మౌనం ముందు మోకరిల్లిన మనసు
ఆత్మను అవనతం చేసుకుంటుంది
ఆత్మను అవనతం చేసుకుంటుంది
పశ్చాత్తాపాలు పెదవెనుకన
నిట్టూర్పుల వర్షాన్నీ కురిపిస్తాయి
ఆవిరైన ఆనందాలు
అవసరాల నవ్వులు తొడుక్కుంటాయి
నిట్టూర్పుల వర్షాన్నీ కురిపిస్తాయి
ఆవిరైన ఆనందాలు
అవసరాల నవ్వులు తొడుక్కుంటాయి
దాచుకున్న గాథలు
వ్యథల కథలు అల్లుతూ
చీకటి కాగితంపై మౌనాక్షరాలు చెక్కుతూ
నిశ్శబ్ద నిశీధిలో
భావాల బావుటానెగరేస్తాయి...!!
వ్యథల కథలు అల్లుతూ
చీకటి కాగితంపై మౌనాక్షరాలు చెక్కుతూ
నిశ్శబ్ద నిశీధిలో
భావాల బావుటానెగరేస్తాయి...!!
.................నిర్వేదం.............
వర్ణాలేవీ కానరానంతగా
మానసం తిమిరాన్ని నింపుకుంది
గమ్యం చీకటి నే సూచిస్తూ
నలుపు రంగు హత్తుకుపోయింది
మెరిసే రంగులేవీ మురిపించడం లేదు
మానసం తిమిరాన్ని నింపుకుంది
గమ్యం చీకటి నే సూచిస్తూ
నలుపు రంగు హత్తుకుపోయింది
మెరిసే రంగులేవీ మురిపించడం లేదు
ప్రపంచాన్ని చూడ్డమే లేదూ
కాసేపలా నింగి నీలపు రంగు
ఆహ్లాదిద్దామంటే
పొద్దుగూకాక చీకటి నిండిన ఆకాశం
నిరాశ గా కనిపిస్తుంది
కాసేపలా నింగి నీలపు రంగు
ఆహ్లాదిద్దామంటే
పొద్దుగూకాక చీకటి నిండిన ఆకాశం
నిరాశ గా కనిపిస్తుంది
ఒక్కోసారి కడలిని చూడ్డానికి వెళతానా
అపుడూ నీటి రంగు కంటికి కనపడదు
నిర్వేదం నింపుకున్న మనసు
కడలికి కష్టాన్ని వల్లే వెయ్యడమే సరిపోతుంది
అపుడూ నీటి రంగు కంటికి కనపడదు
నిర్వేదం నింపుకున్న మనసు
కడలికి కష్టాన్ని వల్లే వెయ్యడమే సరిపోతుంది
వర్ణాలేవీ కనపడనంతగా
జ్ఞాపకాలు పెనవేసుకున్నాయ్
చెరపలేని గాయాలన్నీ
చిందరవందర చేస్తూనే వున్నాయ్
జ్ఞాపకాలు పెనవేసుకున్నాయ్
చెరపలేని గాయాలన్నీ
చిందరవందర చేస్తూనే వున్నాయ్
ఇంద్రధనువు రంగులన్నీ
ఆవహించుకుంటే బావుండనిపిస్తుంది
హరివిల్ల్లునై రంగుల్లో మెరిసిపోవాలనిపిస్తుంది
ఆవహించుకుంటే బావుండనిపిస్తుంది
హరివిల్ల్లునై రంగుల్లో మెరిసిపోవాలనిపిస్తుంది
తుదిలేని ఆశయం......
అలసిన మదిని వెంట బెట్టుకుని
అంతరంగం పయనం ఆగి పోనిదే
అంతరంగం పయనం ఆగి పోనిదే
సంఘర్షణల అవశేషాలు వెంటాడుతూనే
వుంటాయి
స్వప్నాల అన్వేషణలో
స్వప్నాల అన్వేషణలో
అంతుచిక్కవు ఆలోచనలు
ఊపిరి ఉన్నంతవరకు
ఉనికి చాటుతున్నంత వరకు
ఊపిరి ఉన్నంతవరకు
ఉనికి చాటుతున్నంత వరకు
తనువు సహకరించకున్నా....
ఆశకు అంతు వుండదు
అడుగు అలసిపోదు
ఆశకు అంతు వుండదు
అడుగు అలసిపోదు
వత్తిడిని కాలం మాయం చేశాక
వేదన ఛాయలు వెంటాడుతున్నా
బ్రతుకు భారమైనా
యాత్ర చేస్తూనే వుంటుంది
వేదన ఛాయలు వెంటాడుతున్నా
బ్రతుకు భారమైనా
యాత్ర చేస్తూనే వుంటుంది
ఊహలు... ఉద్వేగాలు....
కోరికలో.... వేదనలో...
మనుగడను శాసిస్తూనే వుంటాయి
కోరికలో.... వేదనలో...
మనుగడను శాసిస్తూనే వుంటాయి
సుడిగుండాలను గుండెల్లో వెంటవేసుకుని
నలుగుతున్న మనసుకు నచ్చ చెప్తూనే
కాసిన్ని నవ్వులకై
జీవితం వెంపర్లాడుతూనే వుంటుంది
నలుగుతున్న మనసుకు నచ్చ చెప్తూనే
కాసిన్ని నవ్వులకై
జీవితం వెంపర్లాడుతూనే వుంటుంది
ఆత్మకి ఆకారం కప్పుకుని
వ్యామోహాలు వెతుక్కోవడం...
తుదిలేని ఆశయమే
అనంత జీవయాత్రలో .....!!!
వ్యామోహాలు వెతుక్కోవడం...
తుదిలేని ఆశయమే
అనంత జీవయాత్రలో .....!!!
|| అక్షరమైత్రి ||
అలవికాని ఆలోచనలు ఉప్పెనై ముంచెత్తుతున్నాయి
మౌనాలను వీడలేని నిస్సహాయినయ్యాను
మౌనాలను వీడలేని నిస్సహాయినయ్యాను
నిర్లిప్తతలు నిత్యమై వెంట పడుతుంటే
మాటల పూదోటలో ఎలా విహరించ గలను.?
మాటల పూదోటలో ఎలా విహరించ గలను.?
మదినిండా తిమిరాలే తరుముతున్నాయి
కురిసే వెన్నెలను ఎలా వీక్షించగలను .?
కురిసే వెన్నెలను ఎలా వీక్షించగలను .?
ప్రపంచాన్ని చుడాలని తలుపులు తెరుచుకున్నా
మూగదైన లోకంలో పలుకులు ప్రవహించలేక పోతున్నా
మూగదైన లోకంలో పలుకులు ప్రవహించలేక పోతున్నా
బంధాలు అవసరాలుగా మారి స్వార్ధంతో సహగమనం చేస్తున్నాయి
పలుకరింపుల ప్రశ్నార్ధకాలకు జవాబు దొరకడంలేదు
పలుకరింపుల ప్రశ్నార్ధకాలకు జవాబు దొరకడంలేదు
బ్రతుకుపాఠాలు బతకడం నేర్పిస్తున్నాయి
అక్షరమైత్రి ఆత్మీయమై అక్కున చేర్చుకుంటోంది ..!
అక్షరమైత్రి ఆత్మీయమై అక్కున చేర్చుకుంటోంది ..!
ఎదురుచూపు........
.
రాలిపడే కన్నీటిచుక్కల్లో
చిట్లిపడే చిందులెన్నో
తడిమనసులో తల్లడిల్లు దృశ్యాలు
తారేడే కన్నుల్లో తరిగిపోని నిర్వేదాలు
రాలిపడే కన్నీటిచుక్కల్లో
చిట్లిపడే చిందులెన్నో
తడిమనసులో తల్లడిల్లు దృశ్యాలు
తారేడే కన్నుల్లో తరిగిపోని నిర్వేదాలు
.
అదృష్టాల రెక్కలు కట్టుకుని
విహరించాలని లేనే లేదు
దురదృష్టపు క్షణాల్లో
సంచరించాలని మనసేమీ కోరడంలేదు
అదృష్టాల రెక్కలు కట్టుకుని
విహరించాలని లేనే లేదు
దురదృష్టపు క్షణాల్లో
సంచరించాలని మనసేమీ కోరడంలేదు
.
నాలుగుగోడల ప్రపంచంలో
ఆనవాళ్ళ ఆత్మఘోషలు
ఆశపడి సాధించుకున్న ఆనందాలవి
తడుముకునే చూపుల్లో
మరుపులేని చెమరింపులు
నాలుగుగోడల ప్రపంచంలో
ఆనవాళ్ళ ఆత్మఘోషలు
ఆశపడి సాధించుకున్న ఆనందాలవి
తడుముకునే చూపుల్లో
మరుపులేని చెమరింపులు
.
కనులమధ్య నీరూపం
కరిగిపోని ఙ్ఞాపకం
స్పర్శకందనిదైనా
స్మ్రతిలో పదిలంగా.....
ఓటమి గుర్తుగా
వేదన సాక్షిగా
అక్షరానికి ఆలంబనగా
కనుసన్నల్లో కన్నీటిగా
మదిఘర్షణలో మౌనంగా
పచ్చిగాయమే మనసుకు
గమ్యం చేరేదాకా
మళ్ళీ పొత్తిళ్ళలో పొదుముకునేదాకా....!!
కనులమధ్య నీరూపం
కరిగిపోని ఙ్ఞాపకం
స్పర్శకందనిదైనా
స్మ్రతిలో పదిలంగా.....
ఓటమి గుర్తుగా
వేదన సాక్షిగా
అక్షరానికి ఆలంబనగా
కనుసన్నల్లో కన్నీటిగా
మదిఘర్షణలో మౌనంగా
పచ్చిగాయమే మనసుకు
గమ్యం చేరేదాకా
మళ్ళీ పొత్తిళ్ళలో పొదుముకునేదాకా....!!
........అతఃశ్చేతన......
ఎన్ని మౌనాలు మోయను
ఙ్ఞాపకాలతో మాటాడుకుంటూ
ఎన్ని అక్షరాలు స్రవించను
భావాలలో బంధించుకుంటూ
ఙ్ఞాపకాలతో మాటాడుకుంటూ
ఎన్ని అక్షరాలు స్రవించను
భావాలలో బంధించుకుంటూ
.
కాలానికి కన్నీళ్ళు అంకితమిచ్చినా
ఆరిపోడంలేదు గుండెతడి
అనుభవాల అంతుతెలుసుకున్నా
అర్ధంకావడంలేదు మౌనమది
కాలానికి కన్నీళ్ళు అంకితమిచ్చినా
ఆరిపోడంలేదు గుండెతడి
అనుభవాల అంతుతెలుసుకున్నా
అర్ధంకావడంలేదు మౌనమది
.
ఉరికిన ఊహలన్నీ
గతమైన ఆనందాలు
విహరించిన స్నప్నసామ్రాజ్యాలన్ని
నిలిచిపోయిన నిన్నటి కలలు
ఉరికిన ఊహలన్నీ
గతమైన ఆనందాలు
విహరించిన స్నప్నసామ్రాజ్యాలన్ని
నిలిచిపోయిన నిన్నటి కలలు
.
రెప్పలు మూయని రాత్రులు
శూన్యంలో నిలిచిన నిర్వేదపు చూపులు
నిన్నలు నిడివి పెరిగి
నేటిలో సంచరిస్తున్నాయి
రేపటి ఆశలు అంతుతెలియక
అగాధంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి
రెప్పలు మూయని రాత్రులు
శూన్యంలో నిలిచిన నిర్వేదపు చూపులు
నిన్నలు నిడివి పెరిగి
నేటిలో సంచరిస్తున్నాయి
రేపటి ఆశలు అంతుతెలియక
అగాధంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి
.
సన్నగిల్లిన శశ్తులన్నీ
సంకల్పాన్ని మోస్తున్నాయి
కాలమాగదు కన్నీటిపయనమైనా
చీకటీ ఆగదు వేకువ వెలుగును స్వాగతించకుండా
సన్నగిల్లిన శశ్తులన్నీ
సంకల్పాన్ని మోస్తున్నాయి
కాలమాగదు కన్నీటిపయనమైనా
చీకటీ ఆగదు వేకువ వెలుగును స్వాగతించకుండా
|| మౌనాక్షరాలు....||
మాటలు మౌనాలు దాచేసుకుంటే
చూపులు నిశలతో నిండిపోయాయి
చూపులు నిశలతో నిండిపోయాయి
అంతరంగ మదనం నిత్యమై
ఆశలు నిర్వీర్యమయ్యాయి
ఆశలు నిర్వీర్యమయ్యాయి
కునుకు మరచిన కనులపై
స్వప్నాలు అలిగి వెళ్ళి పోయాయి
స్వప్నాలు అలిగి వెళ్ళి పోయాయి
నొప్పించిన సందర్బాలన్నీ
జ్ఞాపకాలై గుచ్చుకుంటున్నాయి
జ్ఞాపకాలై గుచ్చుకుంటున్నాయి
వేలాడే వదనంలో
నవ్వుల పూలు విచ్చుకోడంలేదు
నవ్వుల పూలు విచ్చుకోడంలేదు
మాధుర్యపు మాటనే మరచిన మనసు
మౌనశాంతిని కోరుతోంది
మౌనశాంతిని కోరుతోంది
కనుల నిండిన నీరు
కలతల మనసు
వెలుగుకి ఎదురు వెళ్ళలేక
చీకటితో చెలిమి చేస్తోంది
ఒలికే కన్నీళ్ళు దాచేందుకూ తోడౌతోంది
కలతల మనసు
వెలుగుకి ఎదురు వెళ్ళలేక
చీకటితో చెలిమి చేస్తోంది
ఒలికే కన్నీళ్ళు దాచేందుకూ తోడౌతోంది
బాధల భారాన్ని మోయలేక
మనసు మౌనాక్షరాలను ప్రసవిస్తోంది....!!
మనసు మౌనాక్షరాలను ప్రసవిస్తోంది....!!
...ప్రకృతితో కరచాలనం...
పత్రాలపై చిత్రంమైన నులివెచ్చని కిరణాలు
మెరిసే ఊషోదయపు మంచుబిందువులు
మసకబారుతున్న సృష్టి అలంకారాలు
మెరిసే ఊషోదయపు మంచుబిందువులు
మసకబారుతున్న సృష్టి అలంకారాలు
అందమైన ఆకుల గల గలలు మాయమై
అరుదైన అద్భుతాలు మరుగై
తన మనుగడనే శాసిస్తున్న
మానవుని వింత వికటాట్టహాసాలు
అరుదైన అద్భుతాలు మరుగై
తన మనుగడనే శాసిస్తున్న
మానవుని వింత వికటాట్టహాసాలు
నిన్నటిదాకా మనుష్యుల కరచాలనం కమనీయమైనదే తరువుకి
నేడది నలిపేసే హరిత హంతకై చుట్టుకుంటోంది జీవ జగతికి
నేడది నలిపేసే హరిత హంతకై చుట్టుకుంటోంది జీవ జగతికి
పాదిచేసి ప్రోది చేసి పెంచుకున్న పచ్చందాలు
కాంక్రీట్ కబ్జాతో కడతేరిపోతున్న ఆనందాలు
కాంక్రీట్ కబ్జాతో కడతేరిపోతున్న ఆనందాలు
చులకనై పోయిందా మానవుని చేతిలో ప్రకృతి
ఆవహించు కుంటోంది కాలుష్యపు రాక్షసి
ఆవహించు కుంటోంది కాలుష్యపు రాక్షసి
తన్మయత్వపు తెమ్మెర తాకడం లేదు
ఆధునిక శీతల గదులకి తాకట్టయ్యింది
ఆధునిక శీతల గదులకి తాకట్టయ్యింది
మేల్కోమంటోంది వైపరిత్యం
విలవిల లాడుతూ భూతలం.......!!
అశ్రువుల ఆలింగనం తప్పనిసరి అయినపుడు
కొంగును కౌగిలించుకునే వున్నాను
శోకం శ్లోకమై ఒలికినపుడు
గుండెను గట్టిగానే బిగపట్టుకున్నాను
స్రవించే గాయం
సవరించే కాలం
కొలమానం లేని ఉపమానాలెన్ని భరించలేదు మనసు
విలవిల లాడుతూ భూతలం.......!!
..... మౌన నివేదన ....
అశ్రువుల ఆలింగనం తప్పనిసరి అయినపుడు
కొంగును కౌగిలించుకునే వున్నాను
శోకం శ్లోకమై ఒలికినపుడు
గుండెను గట్టిగానే బిగపట్టుకున్నాను
స్రవించే గాయం
సవరించే కాలం
కొలమానం లేని ఉపమానాలెన్ని భరించలేదు మనసు
సానుభూతి సంకెళ్ళైనపుడు
సంఘర్షణకు సవరణ తప్పనిసరౌతుంది
నిర్లక్ష్యపు మనసులు నిశ్శబ్దంగా వున్నా
మౌనంతోనే సమరం
సంఘర్షణకు సవరణ తప్పనిసరౌతుంది
నిర్లక్ష్యపు మనసులు నిశ్శబ్దంగా వున్నా
మౌనంతోనే సమరం
మనసు గాయానికి
గెలుపోటములకు ఆరాటపడని
భావాలనే నమ్ముకుని
అంతరంగంతో మాటలు అనివార్యమైనపుడు
అక్షరాలను ఆవహించుకుంటూ
చెమ్మగిల్లిన చరిత్రలు చెప్పుకున్నాను
గెలుపోటములకు ఆరాటపడని
భావాలనే నమ్ముకుని
అంతరంగంతో మాటలు అనివార్యమైనపుడు
అక్షరాలను ఆవహించుకుంటూ
చెమ్మగిల్లిన చరిత్రలు చెప్పుకున్నాను
నిన్నలు కుదేలైనపుడు
ఙ్ఞాపకాలు బావురుమంటున్నా
నేటిలోకి జారిపోవడం తప్పసరి
వెంటరాని క్షణాలన్ని
రేపటి ఆశల రెక్కలు కట్టుకుంటాయి
ఉగ్గబట్టిన ఊహలు ఉసూరంటూ ఉనికిచాటుతుంటాయి
వేదనైనా యానం తప్పదు
ఙ్ఞాపకాలు బావురుమంటున్నా
నేటిలోకి జారిపోవడం తప్పసరి
వెంటరాని క్షణాలన్ని
రేపటి ఆశల రెక్కలు కట్టుకుంటాయి
ఉగ్గబట్టిన ఊహలు ఉసూరంటూ ఉనికిచాటుతుంటాయి
వేదనైనా యానం తప్పదు
వేకువ వెల్లి విరియక ఉంటుందా
సునాయాస ముంగిపుకై
మౌననివేదన నాదయ్యిందిపుడు...!!
సునాయాస ముంగిపుకై
మౌననివేదన నాదయ్యిందిపుడు...!!
......చెలిమి స్పర్శ.......
ఓ చినుకుతడిని ఆస్వాదించిన క్షణం
వానలో తచ్చాడిన బాల్యాల బంధం
వానలో తచ్చాడిన బాల్యాల బంధం
బడిగంట విన్నాక పరిగెట్టె మనసు
భుజాలపై చేతుల పరిచయం
ప్రతి రోజూ కొత్తగానే
భుజాలపై చేతుల పరిచయం
ప్రతి రోజూ కొత్తగానే
తరగతి మారినప్పుడల్లా
జంటగానే ఒకే బల్ల మీద
వెనుకైనా వెతుక్కుని కూర్చోడం భలేగా
జంటగానే ఒకే బల్ల మీద
వెనుకైనా వెతుక్కుని కూర్చోడం భలేగా
తాయిలాలు పంచుకోవడం
ఎంగిలి మరకల స్నేహ పరిళాలు హత్తుకోవడం
ఎంగిలి మరకల స్నేహ పరిళాలు హత్తుకోవడం
ఇంటిగంట కొట్టాక చెరో దిశలో వెళ్ళినా
చివరదాకా చూసుకోవడం
చెదిరి పోని స్నేహానికి తియ్యని గుర్తులం మనం
చివరదాకా చూసుకోవడం
చెదిరి పోని స్నేహానికి తియ్యని గుర్తులం మనం
ఆదివారమైనా ఏదో నెపంతో
చెలిమి స్పర్శను ఆస్వాదించడం అవసరమనిపించేది
చెలిమి స్పర్శను ఆస్వాదించడం అవసరమనిపించేది
నిన్నటిలానే ఉదయాల చిరునవ్వులు
నేటిలో కనులతో మాట్లాడుకోవడం
మామూలైనా...
మమకారం అల్లుకున్న ఆక్షణాలన్నీ
ఙ్ఙాపకాల్లో కుప్పలుగానే పోగేసుకున్నాయి
నేటిలో కనులతో మాట్లాడుకోవడం
మామూలైనా...
మమకారం అల్లుకున్న ఆక్షణాలన్నీ
ఙ్ఙాపకాల్లో కుప్పలుగానే పోగేసుకున్నాయి
నీ గెలుపును ఆకాంక్షిస్తూ నేను
నా విజయాన్ని ఆస్వాదిస్తు నువ్వు
కల్మషమే లేదప్పుడు
నా విజయాన్ని ఆస్వాదిస్తు నువ్వు
కల్మషమే లేదప్పుడు
కరిగింది కాలమే అయినా
స్మ్రతులు పదిలంగానే
బాటలు వేరై తలోదారి....!!
మూసివున్న రెప్పలమాటున
చీకటి రాల్చే వర్ణాలెన్నో
స్మ్రతులు పదిలంగానే
బాటలు వేరై తలోదారి....!!
......నిశి.......
మూసివున్న రెప్పలమాటున
చీకటి రాల్చే వర్ణాలెన్నో
తరలి పోయిన చిరునవ్వులన్నీ
తిమిరాలలో తడిసిన వైనాలే
తిమిరాలలో తడిసిన వైనాలే
దిగులు దుప్పటి కప్పుకున్న రేయి
చింతల మాటున భావాల మాలలు అల్లుతుంది
చింతల మాటున భావాల మాలలు అల్లుతుంది
ఓ వాక్యం ఎన్ని స్మ్రతులను పోగేసిందో
ఓపదం ఎంత భారాన్ని ఒంపేసిందో
అల్లిన కవితల్లో మనసు కన్నీళ్ళెన్ని కుమ్మరించిందో
ఓపదం ఎంత భారాన్ని ఒంపేసిందో
అల్లిన కవితల్లో మనసు కన్నీళ్ళెన్ని కుమ్మరించిందో
పలవరించే ఆలాపనలో పలుకరించే ఙ్ఞాపకాలు
వెంటాడే ఓటమి గాధలు మనసుమోసే మౌన సంఘర్షణలు నిశీధి నిశ్శబ్దమై
ఆవహించిన అశ్రువులకు అంకితమైన గతి
వెంటాడే ఓటమి గాధలు మనసుమోసే మౌన సంఘర్షణలు నిశీధి నిశ్శబ్దమై
ఆవహించిన అశ్రువులకు అంకితమైన గతి
తీరం చేరని ఆశల నావని నేను
ఉప్పెనలో ఊగిసలాడుతున్నా తెరచాపనై
ఉప్పెనలో ఊగిసలాడుతున్నా తెరచాపనై
ఎంతని ఏమార్చను కాలిపోయిన కలల్ని
మధ్యలో మిగిలి పోయిన మిధ్యా జీవితం
మధ్యలో మిగిలి పోయిన మిధ్యా జీవితం
నిశలు మోసే నిక్షిప్త గాయాలు
నైరాశ్యం నిండిపోయిన నిగూఢ చరితలు
నైరాశ్యం నిండిపోయిన నిగూఢ చరితలు
కరిగిపోయిన కాలమంతా కావ్యమై మిగిలిందేమో...!!
No comments:
Post a Comment