(1)
చీకటి ఆశ....
సన్నగిల్లిన మది స్ధాణువై
మౌన సంగీతాన్ని వినిపిస్తూనే వుంది
మౌన సంగీతాన్ని వినిపిస్తూనే వుంది
గతమైపోయిన గాయాలు
ముళ్ళై గుచ్చుకుంటూ
జాలి మాటలు చేదు స్వరాలై
గగనం గంభీరమై
గమ్యానికి బాటలు చూపిస్తున్నది
ముళ్ళై గుచ్చుకుంటూ
జాలి మాటలు చేదు స్వరాలై
గగనం గంభీరమై
గమ్యానికి బాటలు చూపిస్తున్నది
నాటి గాయల వెక్కిళ్ళు
నేడు ఙ్ఞాపకాల కన్నీళ్ళు రాలుస్తూ
శిధిల బంధాలను ఏకరువు పెడుతున్నాయి
నేడు ఙ్ఞాపకాల కన్నీళ్ళు రాలుస్తూ
శిధిల బంధాలను ఏకరువు పెడుతున్నాయి
తుది దుప్పటి కప్పుకున్నాక
నాదన్నది ఏమి లేదన్నది కూడా
తెలియని అచేతన స్ధితిలో
ఆశల బ్రతుకు
అనుబంధాలకై ఆరాట పడుతూనే వుంటోంది
నాదన్నది ఏమి లేదన్నది కూడా
తెలియని అచేతన స్ధితిలో
ఆశల బ్రతుకు
అనుబంధాలకై ఆరాట పడుతూనే వుంటోంది
కొడిగట్టె ప్రాణి కూడా
కోరికల చిట్టా విప్పుతూ
అంతిమ ఘడియలు కూడా
ఊపిరికై ఉరకలు వేస్తూనే వుంటాయి
కోరికల చిట్టా విప్పుతూ
అంతిమ ఘడియలు కూడా
ఊపిరికై ఉరకలు వేస్తూనే వుంటాయి
ప్రతి జీవిత చిత్రంలో
కాలగర్భంలో కలిసిపోయే క్షణాలన్నిటిలో
దుఃఖాన్ని సవరించుకున్న సందర్భాలు వుండే వుంటాయి
కాలగర్భంలో కలిసిపోయే క్షణాలన్నిటిలో
దుఃఖాన్ని సవరించుకున్న సందర్భాలు వుండే వుంటాయి
చీకటిలో చింతలు
ఓటమి అనుభవాలు
విజయానికి చేరువ చేసే వుంటాయి
ఓటమి అనుభవాలు
విజయానికి చేరువ చేసే వుంటాయి
కదంతొక్కిన కన్నీళ్ళు
సంకల్ప మనసుతో సావాసం చేస్తూ
నిన్నటి కలలకు
కొత్తఆశల దీపాలు వెలిగిస్తాయి
సంకల్ప మనసుతో సావాసం చేస్తూ
నిన్నటి కలలకు
కొత్తఆశల దీపాలు వెలిగిస్తాయి
మౌనం ముందు మోకరిల్లిన మనసు
ఆత్మను అవనతం చేసుకుంటుంది
ఆత్మను అవనతం చేసుకుంటుంది
పశ్చాత్తాపాలు పెదవెనుకన
నిట్టూర్పుల వర్షాన్నీ కురిపిస్తాయి
ఆవిరైన ఆనందాలు
అవసరాల నవ్వులు తొడుక్కుంటాయి
నిట్టూర్పుల వర్షాన్నీ కురిపిస్తాయి
ఆవిరైన ఆనందాలు
అవసరాల నవ్వులు తొడుక్కుంటాయి
దాచుకున్న గాథలు
వ్యథల కథలు అల్లుతూ
చీకటి కాగితంపై మౌనాక్షరాలు చెక్కుతూ
నిశ్శబ్ద నిశీధిలో
భావాల బావుటానెగరేస్తాయి...!!
వ్యథల కథలు అల్లుతూ
చీకటి కాగితంపై మౌనాక్షరాలు చెక్కుతూ
నిశ్శబ్ద నిశీధిలో
భావాల బావుటానెగరేస్తాయి...!!
(2)
.................నిర్వేదం.............
వర్ణాలేవీ కానరానంతగా
మానసం తిమిరాన్ని నింపుకుంది
గమ్యం చీకటి నే సూచిస్తూ
నలుపు రంగు హత్తుకుపోయింది
మెరిసే రంగులేవీ మురిపించడం లేదు
మానసం తిమిరాన్ని నింపుకుంది
గమ్యం చీకటి నే సూచిస్తూ
నలుపు రంగు హత్తుకుపోయింది
మెరిసే రంగులేవీ మురిపించడం లేదు
ప్రపంచాన్ని చూడ్డమే లేదూ
కాసేపలా నింగి నీలపు రంగు
ఆహ్లాదిద్దామంటే
పొద్దుగూకాక చీకటి నిండిన ఆకాశం
నిరాశ గా కనిపిస్తుంది
కాసేపలా నింగి నీలపు రంగు
ఆహ్లాదిద్దామంటే
పొద్దుగూకాక చీకటి నిండిన ఆకాశం
నిరాశ గా కనిపిస్తుంది
ఒక్కోసారి కడలిని చూడ్డానికి వెళతానా
అపుడూ నీటి రంగు కంటికి కనపడదు
నిర్వేదం నింపుకున్న మనసు
కడలికి కష్టాన్ని వల్లే వెయ్యడమే సరిపోతుంది
అపుడూ నీటి రంగు కంటికి కనపడదు
నిర్వేదం నింపుకున్న మనసు
కడలికి కష్టాన్ని వల్లే వెయ్యడమే సరిపోతుంది
వర్ణాలేవీ కనపడనంతగా
జ్ఞాపకాలు పెనవేసుకున్నాయ్
చెరపలేని గాయాలన్నీ
చిందరవందర చేస్తూనే వున్నాయ్
జ్ఞాపకాలు పెనవేసుకున్నాయ్
చెరపలేని గాయాలన్నీ
చిందరవందర చేస్తూనే వున్నాయ్
ఇంద్రధనువు రంగులన్నీ
ఆవహించుకుంటే బావుండనిపిస్తుంది
హరివిల్ల్లునై రంగుల్లో మెరిసిపోవాలనిపిస్తుంది
ఆవహించుకుంటే బావుండనిపిస్తుంది
హరివిల్ల్లునై రంగుల్లో మెరిసిపోవాలనిపిస్తుంది
...............వాణి
(3)
తుదిలేని ఆశయం......
అలసిన మదిని వెంట బెట్టుకుని
అంతరంగం పయనం ఆగి పోనిదే
అంతరంగం పయనం ఆగి పోనిదే
సంఘర్షణల అవశేషాలు వెంటాడుతూనే వుంటాయి
స్వప్నాల అన్వేషణలో
స్వప్నాల అన్వేషణలో
అంతుచిక్కవు ఆలోచనలు
ఊపిరి ఉన్నంతవరకు
ఉనికి చాటుతున్నంత వరకు
ఊపిరి ఉన్నంతవరకు
ఉనికి చాటుతున్నంత వరకు
తనువు సహకరించకున్నా....
ఆశకు అంతు వుండదు
అడుగు అలసిపోదు
ఆశకు అంతు వుండదు
అడుగు అలసిపోదు
వత్తిడిని కాలం మాయం చేశాక
వేదన ఛాయలు వెంటాడుతున్నా
బ్రతుకు భారమైనా
యాత్ర చేస్తూనే వుంటుంది
వేదన ఛాయలు వెంటాడుతున్నా
బ్రతుకు భారమైనా
యాత్ర చేస్తూనే వుంటుంది
ఊహలు... ఉద్వేగాలు....
కోరికలో.... వేదనలో...
మనుగడను శాసిస్తూనే వుంటాయి
కోరికలో.... వేదనలో...
మనుగడను శాసిస్తూనే వుంటాయి
సుడిగుండాలను గుండెల్లో వెంటవేసుకుని
నలుగుతున్న మనసుకు నచ్చ చెప్తూనే
కాసిన్ని నవ్వులకై
జీవితం వెంపర్లాడుతూనే వుంటుంది
నలుగుతున్న మనసుకు నచ్చ చెప్తూనే
కాసిన్ని నవ్వులకై
జీవితం వెంపర్లాడుతూనే వుంటుంది
ఆత్మకి ఆకారం కప్పుకుని
వ్యామోహాలు వెతుక్కోవడం...
తుదిలేని ఆశయమే
అనంత జీవయాత్రలో .....!!!
వ్యామోహాలు వెతుక్కోవడం...
తుదిలేని ఆశయమే
అనంత జీవయాత్రలో .....!!!
(4) || అక్షరమైత్రి ||
అలవికాని ఆలోచనలు ఉప్పెనై ముంచెత్తుతున్నాయి
మౌనాలను వీడలేని నిస్సహాయినయ్యాను
మౌనాలను వీడలేని నిస్సహాయినయ్యాను
నిర్లిప్తతలు నిత్యమై వెంట పడుతుంటే
మాటల పూదోటలో ఎలా విహరించ గలను.?
మాటల పూదోటలో ఎలా విహరించ గలను.?
మదినిండా తిమిరాలే తరుముతున్నాయి
కురిసే వెన్నెలను ఎలా వీక్షించగలను .?
కురిసే వెన్నెలను ఎలా వీక్షించగలను .?
ప్రపంచాన్ని చుడాలని తలుపులు తెరుచుకున్నా
మూగదైన లోకంలో పలుకులు ప్రవహించలేక పోతున్నా
మూగదైన లోకంలో పలుకులు ప్రవహించలేక పోతున్నా
బంధాలు అవసరాలుగా మారి స్వార్ధంతో సహగమనం చేస్తున్నాయి
పలుకరింపుల ప్రశ్నార్ధకాలకు జవాబు దొరకడంలేదు
పలుకరింపుల ప్రశ్నార్ధకాలకు జవాబు దొరకడంలేదు
బ్రతుకుపాఠాలు బతకడం నేర్పిస్తున్నాయి
అక్షరమైత్రి ఆత్మీయమై అక్కున చేర్చుకుంటోంది ..!
అక్షరమైత్రి ఆత్మీయమై అక్కున చేర్చుకుంటోంది ..!
(5)
ఊహకు ఊపిరాగాక.....
చిలిపి నవ్వులు చీకటిలో చేరాక
స్శర్శను కోల్పోయిన రూపం
చిత్రంలో భధ్రంగానే వున్నా...
శబ్ధించని హాసాలు
గతమైన ఆనందమై
గాయ పరుస్తున్నాయి
చిలిపి నవ్వులు చీకటిలో చేరాక
స్శర్శను కోల్పోయిన రూపం
చిత్రంలో భధ్రంగానే వున్నా...
శబ్ధించని హాసాలు
గతమైన ఆనందమై
గాయ పరుస్తున్నాయి
పొత్తిళ్ళు ఖాళీ అయ్యాక
కన్నీళ్ళ కొక్కానికి వేలాడుతూ
వెక్కిరించే ఒడి
ఓడిన ఛాయలకు
ఙ్ఞాపకాల జాడలకు
ఋజువుకు
ఋణంగా మిగిలి పోయింది
కన్నీళ్ళ కొక్కానికి వేలాడుతూ
వెక్కిరించే ఒడి
ఓడిన ఛాయలకు
ఙ్ఞాపకాల జాడలకు
ఋజువుకు
ఋణంగా మిగిలి పోయింది
పసితనం నుండి ప్రాయం దాకా
పల్లవించిన సంతోషాలు
తల్లడిల్లిన సందర్భాలు
సంఘర్షణల సవాళ్ళెన్నో
గుండె చప్పుడులో
ఇంకా స్పష్టంగానే సవారీ చేస్తున్నాయి
పల్లవించిన సంతోషాలు
తల్లడిల్లిన సందర్భాలు
సంఘర్షణల సవాళ్ళెన్నో
గుండె చప్పుడులో
ఇంకా స్పష్టంగానే సవారీ చేస్తున్నాయి
ఊపిరాగిన ఊహలు
ఉనికి మోసే ఙ్ఞాపకాలు
వేదన సంకెళ్ళకు బందీనే
వెన్నెల సంతకం చెరిగాక
ఉనికి మోసే ఙ్ఞాపకాలు
వేదన సంకెళ్ళకు బందీనే
వెన్నెల సంతకం చెరిగాక
అశ్రువులు అక్షరాల్లో సేదతీరుతూ
మౌనభావాలతో చల్లార్చుకుంటున్నాయి.!!
మౌనభావాలతో చల్లార్చుకుంటున్నాయి.!!
(6)
|| మౌనాక్షరాలు....||
మాటలు మౌనాలు దాచేసుకుంటే
చూపులు నిశలతో నిండిపోయాయి
చూపులు నిశలతో నిండిపోయాయి
అంతరంగ మదనం నిత్యమై
ఆశలు నిర్వీర్యమయ్యాయి
ఆశలు నిర్వీర్యమయ్యాయి
కునుకు మరచిన కనులపై
స్వప్నాలు అలిగి వెళ్ళి పోయాయి
స్వప్నాలు అలిగి వెళ్ళి పోయాయి
నొప్పించిన సందర్బాలన్నీ
జ్ఞాపకాలై గుచ్చుకుంటున్నాయి
జ్ఞాపకాలై గుచ్చుకుంటున్నాయి
వేలాడే వదనంలో
నవ్వుల పూలు విచ్చుకోడంలేదు
నవ్వుల పూలు విచ్చుకోడంలేదు
మాధుర్యపు మాటనే మరచిన మనసు
మౌనశాంతిని కోరుతోంది
మౌనశాంతిని కోరుతోంది
కనుల నిండిన నీరు
కలతల మనసు
వెలుగుకి ఎదురు వెళ్ళలేక
చీకటితో చెలిమి చేస్తోంది
ఒలికే కన్నీళ్ళు దాచేందుకూ తోడౌతోంది
కలతల మనసు
వెలుగుకి ఎదురు వెళ్ళలేక
చీకటితో చెలిమి చేస్తోంది
ఒలికే కన్నీళ్ళు దాచేందుకూ తోడౌతోంది
బాధల భారాన్ని మోయలేక
మనసు మౌనాక్షరాలను ప్రసవిస్తోంది....!!
మనసు మౌనాక్షరాలను ప్రసవిస్తోంది....!!
(7)
అక్షరమై....
గాయం ఘాటుగానే తగిలింది
మనసు నొప్పిని భరించలేక పోతోంది
మనసు నొప్పిని భరించలేక పోతోంది
గుండె కఠినంగానే మారింది
భవిష్యత్తును వెతుక్కోమంటోంది
భవిష్యత్తును వెతుక్కోమంటోంది
జ్ఞాపకాల లోతులు తవ్వేకొద్దీ
తొంగి చూస్తున్నా....
తొంగి చూస్తున్నా....
మధురక్షణాలేమైనా
తారసపడతాయేమోనని
తారసపడతాయేమోనని
గాయపడ్డ క్షణాలన్నీ గుర్తొస్తూనే వున్నాయ్
అర్ధం కాని అంతులేని ప్రశ్నలు సంధిస్తూ
అర్ధం కాని అంతులేని ప్రశ్నలు సంధిస్తూ
జీవ చైతన్యం కోల్పోయానేమో
జూలు విదల్చలేక పోతున్నా
జూలు విదల్చలేక పోతున్నా
అమాయకత్వంలోనే వుండిపోయానేమో
అంతరంగాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నా
అంతరంగాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నా
సానుభూతి నాకెందుకు
గుండె నిండా ధైర్యం కావాలి
గుండె నిండా ధైర్యం కావాలి
స్పందించే మనసుంటే సరిపోదా
సహకారం దొరకడానికి
సహకారం దొరకడానికి
ఎడారిలో నేనేమీ లేను
గొంతు తడి ఆరకపోడానికి
గొంతు తడి ఆరకపోడానికి
కావల్సినన్ని కన్నీళ్ళు వున్నాయ్
కుండలు నింపుకోడానికి...
కుండలు నింపుకోడానికి...
నన్ను నేను గెలిపించుకుంటున్నా
కవనమై మిగిలిపోతూ
కవనమై మిగిలిపోతూ
భావ సంద్రంలో ఈదులాడుతున్నా
పదమై పల్లవిస్తూ...
పదమై పల్లవిస్తూ...
అక్షరాలు రాశులుగా కుమ్మరిస్తున్నా
అంతఃసంఘర్షణను అలంకరిస్తూ .....!!
అంతఃసంఘర్షణను అలంకరిస్తూ .....!!
(8)
నిలదీసి అడగాలని వుంది…………
గతమైన గాయాలన్నీ
మౌనంగానే వుండమంటున్నాయి
దాచినా దాగని దిగుళ్ళు
మెరుపులను మాయం చేస్తున్నాయి
మౌనంగానే వుండమంటున్నాయి
దాచినా దాగని దిగుళ్ళు
మెరుపులను మాయం చేస్తున్నాయి
వద్దన్నా వినని పెదవులు
నిట్టూర్పుల శబ్దాలతో
నిశబ్దాన్ని బద్దలు చేస్తున్నాయి
నిట్టూర్పుల శబ్దాలతో
నిశబ్దాన్ని బద్దలు చేస్తున్నాయి
నిద్దురరాని కనులు
నిశలలోనీళ్ళు కారుస్తున్నాయి
తడిసిన తలగడ చెంపల్నితాకి
వేదనను వెంటాడుతూనే వుంది
నిశలలోనీళ్ళు కారుస్తున్నాయి
తడిసిన తలగడ చెంపల్నితాకి
వేదనను వెంటాడుతూనే వుంది
కురిసే వెన్నెల కూడా
ముఖాన వన్నేలద్దలేక
విరిసే నవ్వులకై వెతుక్కుంటోంది
ముఖాన వన్నేలద్దలేక
విరిసే నవ్వులకై వెతుక్కుంటోంది
నాటి సంతోషాలు నేడు నిర్లిప్తతలుగా
నాటి నవ్వులు నేడు మౌన శబ్దాలుగా
గతమై పోయాయి ఆనంద నర్తనాలు
గాయమై పోయాయి ఆశ నింపిన ఆకృతులు
నాటి నవ్వులు నేడు మౌన శబ్దాలుగా
గతమై పోయాయి ఆనంద నర్తనాలు
గాయమై పోయాయి ఆశ నింపిన ఆకృతులు
అలనాటి సంతోషాలు పరిగెట్టి పోయాయి
వెక్కిరించే విధి పరిహసిస్తూనే వుంది
ప్రశ్నగానే మిగిలింది
ఆయువు అర్ధాయువు ఎలా అయ్యిందని ?
వెక్కిరించే విధి పరిహసిస్తూనే వుంది
ప్రశ్నగానే మిగిలింది
ఆయువు అర్ధాయువు ఎలా అయ్యిందని ?
నవమాసాల భారం
ఇపుడు బరువుగా అనిపిస్తోంది
అంతుచిక్కని కారణాలెన్నో
నీ అంతిమ ప్రయాణానికి
ఇపుడు బరువుగా అనిపిస్తోంది
అంతుచిక్కని కారణాలెన్నో
నీ అంతిమ ప్రయాణానికి
తరలిపోయిన కాలాన్ని
తిరిగి ఇచ్సెయ్యమంటు
నీవు లేని కాలాన్ని
నిలదీసి అడగాలని వుంది
తిరిగి ఇచ్సెయ్యమంటు
నీవు లేని కాలాన్ని
నిలదీసి అడగాలని వుంది
అయినా ....
నిశలు చీలుస్తున్నాయి మౌనాలు
మెరుగులద్దుకుంటూ
అక్షరాలని ఆలింగనం చేసుకుంటున్నా
భావాలకి బాధలు చెప్పు కుంటూ….!!
మెరుగులద్దుకుంటూ
అక్షరాలని ఆలింగనం చేసుకుంటున్నా
భావాలకి బాధలు చెప్పు కుంటూ….!!
(9)
గాయం నేర్పిన విజయం....
ఆరిపోని కనులు ఆగిపోని అలజడులు
నిర్వేదం నిండిన వడలిన వదనం
నిర్వేదం నిండిన వడలిన వదనం
గాయాన్ని మోసే మనసు
గుండెకోతను కుండపోతగా రాలుస్తుంది
గుండెకోతను కుండపోతగా రాలుస్తుంది
చీకటి మేఘాలు చింతలై తచ్చాడుతూ
కురిసే వెలుతురుకై వెంపర్లాడుతాయి
కురిసే వెలుతురుకై వెంపర్లాడుతాయి
ఎడారి మనసులో నిట్టూర్పుల సడి
ఎండుటాకుల శబ్దంలా వినిపిస్తుంది
ఎండుటాకుల శబ్దంలా వినిపిస్తుంది
వేదనతో వేలాడే తనువు హృదయం
చిగురించే ఉషోదయాలకై ఆశపడుతూనే వుంటాయి
చిగురించే ఉషోదయాలకై ఆశపడుతూనే వుంటాయి
ఆగిపోదు కాలం సంఘర్షణతో చెలిమిచేసినా
భావమై ప్రకటించాక అక్షరమే వెలుగుతుంది విజేతగా....!!
భావమై ప్రకటించాక అక్షరమే వెలుగుతుంది విజేతగా....!!
(10)
అలసిపోని అంతరంగం ........... !!
.
కాలంలో ఒదిగిపోయిన కన్నీటి క్షణాలు
చరిత్రగా మిగిలిపోయిన సంతోష సందర్భాలు
ఙ్ఞాపకాల చప్పుళ్ళు చేస్తున్న గాయాల ఘటనలు
కాలంలో ఒదిగిపోయిన కన్నీటి క్షణాలు
చరిత్రగా మిగిలిపోయిన సంతోష సందర్భాలు
ఙ్ఞాపకాల చప్పుళ్ళు చేస్తున్న గాయాల ఘటనలు
చీకటిలో వేలాడే చెమరించే చినుకులు
నిశబ్దం నిట్టూర్పును మోస్తుంటే
తలగడలో దాగుతున్న తల్లడిల్లిన మరకలు
నిశబ్దం నిట్టూర్పును మోస్తుంటే
తలగడలో దాగుతున్న తల్లడిల్లిన మరకలు
శూన్యంతో స్నేహమే తడిచూపుకు
నిదురను వెలివేసిన మౌనం గుండెతో ఘర్షణ పడుతోంది
లెక్కలేని చుక్కలెన్నొ చెక్కిలిని ముద్దాడి జారిపోతున్నాయి
నిదురను వెలివేసిన మౌనం గుండెతో ఘర్షణ పడుతోంది
లెక్కలేని చుక్కలెన్నొ చెక్కిలిని ముద్దాడి జారిపోతున్నాయి
చీకటి మనసు భావాల జాతర చేస్తే
కాగితంపైకలం కన్నీటి సంతకాలు నింపింది
కాగితంపైకలం కన్నీటి సంతకాలు నింపింది
కలలు ఒలికిపోయినా
కావ్యాలు కలవరింతలౌతున్నాయి
కావ్యాలు కలవరింతలౌతున్నాయి
గాయాల గుర్తులు గుండెలపై చిందులేసినా
మనసుతడులే మధురభావాలు రచిస్తున్నాయి
మనసుతడులే మధురభావాలు రచిస్తున్నాయి
చీకటులు చిరునవ్వును మింగేసినా
వెన్నెలంటి అక్షరాలు వెంట వస్తున్నాయి
వెన్నెలంటి అక్షరాలు వెంట వస్తున్నాయి
అంతరంగం అలసి పోవడం లేదెందుకో
భావమాధుర్యంలో మమత గెలుచుకుంటోంది కాబోలు...!!
భావమాధుర్యంలో మమత గెలుచుకుంటోంది కాబోలు...!!
(11)
ఎదురుచూపు........
.
రాలిపడే కన్నీటిచుక్కల్లో
చిట్లిపడే చిందులెన్నో
తడిమనసులో తల్లడిల్లు దృశ్యాలు
తారేడే కన్నుల్లో తరిగిపోని నిర్వేదాలు
రాలిపడే కన్నీటిచుక్కల్లో
చిట్లిపడే చిందులెన్నో
తడిమనసులో తల్లడిల్లు దృశ్యాలు
తారేడే కన్నుల్లో తరిగిపోని నిర్వేదాలు
.
అదృష్టాల రెక్కలు కట్టుకుని
విహరించాలని లేనే లేదు
దురదృష్టపు క్షణాల్లో
సంచరించాలని మనసేమీ కోరడంలేదు
అదృష్టాల రెక్కలు కట్టుకుని
విహరించాలని లేనే లేదు
దురదృష్టపు క్షణాల్లో
సంచరించాలని మనసేమీ కోరడంలేదు
.
నాలుగుగోడల ప్రపంచంలో
ఆనవాళ్ళ ఆత్మఘోషలు
ఆశపడి సాధించుకున్న ఆనందాలవి
తడుముకునే చూపుల్లో
మరుపులేని చెమరింపులు
నాలుగుగోడల ప్రపంచంలో
ఆనవాళ్ళ ఆత్మఘోషలు
ఆశపడి సాధించుకున్న ఆనందాలవి
తడుముకునే చూపుల్లో
మరుపులేని చెమరింపులు
.
కనులమధ్య నీరూపం
కరిగిపోని ఙ్ఞాపకం
స్పర్శకందనిదైనా
స్మ్రతిలో పదిలంగా.....
ఓటమి గుర్తుగా
వేదన సాక్షిగా
అక్షరానికి ఆలంబనగా
కనుసన్నల్లో కన్నీటిగా
మదిఘర్షణలో మౌనంగా
పచ్చిగాయమే మనసుకు
గమ్యం చేరేదాకా
మళ్ళీ పొత్తిళ్ళలో పొదుముకునేదాకా....!!
కనులమధ్య నీరూపం
కరిగిపోని ఙ్ఞాపకం
స్పర్శకందనిదైనా
స్మ్రతిలో పదిలంగా.....
ఓటమి గుర్తుగా
వేదన సాక్షిగా
అక్షరానికి ఆలంబనగా
కనుసన్నల్లో కన్నీటిగా
మదిఘర్షణలో మౌనంగా
పచ్చిగాయమే మనసుకు
గమ్యం చేరేదాకా
మళ్ళీ పొత్తిళ్ళలో పొదుముకునేదాకా....!!
(12)
........అతఃశ్చేతన......
ఎన్ని మౌనాలు మోయను
ఙ్ఞాపకాలతో మాటాడుకుంటూ
ఎన్ని అక్షరాలు స్రవించను
భావాలలో బంధించుకుంటూ
ఙ్ఞాపకాలతో మాటాడుకుంటూ
ఎన్ని అక్షరాలు స్రవించను
భావాలలో బంధించుకుంటూ
.
కాలానికి కన్నీళ్ళు అంకితమిచ్చినా
ఆరిపోడంలేదు గుండెతడి
అనుభవాల అంతుతెలుసుకున్నా
అర్ధంకావడంలేదు మౌనమది
కాలానికి కన్నీళ్ళు అంకితమిచ్చినా
ఆరిపోడంలేదు గుండెతడి
అనుభవాల అంతుతెలుసుకున్నా
అర్ధంకావడంలేదు మౌనమది
.
ఉరికిన ఊహలన్నీ
గతమైన ఆనందాలు
విహరించిన స్నప్నసామ్రాజ్యాలన్ని
నిలిచిపోయిన నిన్నటి కలలు
ఉరికిన ఊహలన్నీ
గతమైన ఆనందాలు
విహరించిన స్నప్నసామ్రాజ్యాలన్ని
నిలిచిపోయిన నిన్నటి కలలు
.
రెప్పలు మూయని రాత్రులు
శూన్యంలో నిలిచిన నిర్వేదపు చూపులు
నిన్నలు నిడివి పెరిగి
నేటిలో సంచరిస్తున్నాయి
రేపటి ఆశలు అంతుతెలియక
అగాధంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి
రెప్పలు మూయని రాత్రులు
శూన్యంలో నిలిచిన నిర్వేదపు చూపులు
నిన్నలు నిడివి పెరిగి
నేటిలో సంచరిస్తున్నాయి
రేపటి ఆశలు అంతుతెలియక
అగాధంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి
.
సన్నగిల్లిన శశ్తులన్నీ
సంకల్పాన్ని మోస్తున్నాయి
కాలమాగదు కన్నీటిపయనమైనా
చీకటీ ఆగదు వేకువ వెలుగును స్వాగతించకుండా
సన్నగిల్లిన శశ్తులన్నీ
సంకల్పాన్ని మోస్తున్నాయి
కాలమాగదు కన్నీటిపయనమైనా
చీకటీ ఆగదు వేకువ వెలుగును స్వాగతించకుండా
.
అంతుచిక్కని జీవనపోరాటాలు
అంతంలేని ఆశల ఆరాటాలు
సంఘర్షణలు ఎన్నున్నా
సాగాల్సిందే ప్రయాణాలు ....!!
అంతుచిక్కని జీవనపోరాటాలు
అంతంలేని ఆశల ఆరాటాలు
సంఘర్షణలు ఎన్నున్నా
సాగాల్సిందే ప్రయాణాలు ....!!
(13)
.......ఒక మౌనం....
ఎడారి మనసే
ఎండి పోవడం లేదు
ఆశల చూపులు
దోసిళ్ళకొద్దీ కన్నీళ్ళు
కాలంపై కుమ్మరిస్తూ
సంకెళ్ళు వేసుకుని
సాగిపోతోంది గమనం
ఎండి పోవడం లేదు
ఆశల చూపులు
దోసిళ్ళకొద్దీ కన్నీళ్ళు
కాలంపై కుమ్మరిస్తూ
సంకెళ్ళు వేసుకుని
సాగిపోతోంది గమనం
.
నిండు కుండైన గుండెలు
నిండుకోని నిట్టూర్పులు
ఈడ్చుకొస్తున్న క్షణాలకు
అడ్డుపడుతున్న ఆశలెన్నో
నలుగుతున్న కనుల్లో
నలుసుపడ్డ కలవరాలు
నిండు కుండైన గుండెలు
నిండుకోని నిట్టూర్పులు
ఈడ్చుకొస్తున్న క్షణాలకు
అడ్డుపడుతున్న ఆశలెన్నో
నలుగుతున్న కనుల్లో
నలుసుపడ్డ కలవరాలు
.
మాయమైన చిట్టినవ్వులు
ఊహల్లో మెరిసి మౌనమౌతున్నాయి
అంతరంగాన్ని చేదుకుంటూ
ఆలాపనే హత్తుకుంటూ
నిశబ్దం గెలిచిన ఙ్ఞాపకం
నిర్వేదాన్ని ఊరడిస్తుంది
మాయమైన చిట్టినవ్వులు
ఊహల్లో మెరిసి మౌనమౌతున్నాయి
అంతరంగాన్ని చేదుకుంటూ
ఆలాపనే హత్తుకుంటూ
నిశబ్దం గెలిచిన ఙ్ఞాపకం
నిర్వేదాన్ని ఊరడిస్తుంది
.
మదిలో సుడిగుండాలు
మౌనం మోసే సంఘర్షణలు
నవ్వులకు నిరుపేదనై
భావాలకు బానిసనై
అక్షరాల ఒడిలో తలదాచుకుంటూ
నిండునవ్వులకై తడుముకుంటోంది హృది........!!
మదిలో సుడిగుండాలు
మౌనం మోసే సంఘర్షణలు
నవ్వులకు నిరుపేదనై
భావాలకు బానిసనై
అక్షరాల ఒడిలో తలదాచుకుంటూ
నిండునవ్వులకై తడుముకుంటోంది హృది........!!
(14)
ఆశకు ఆకృతి…..
మౌనందాల్చిన మనసుగది
గుర్తులు రేపే వ్యధే ఇది
నవ్వులలోకం వెలివేసింది
వెన్నెలవెలుగులు దోచేసింది
గుర్తులు రేపే వ్యధే ఇది
నవ్వులలోకం వెలివేసింది
వెన్నెలవెలుగులు దోచేసింది
.
కన్నులతీరం తడిసేవుంది
వేదననీటిని ఒలుకుతువుంది
నిశీధిమేఘం కమ్మేసింది
మౌననిధులే కానుక అంది
కన్నులతీరం తడిసేవుంది
వేదననీటిని ఒలుకుతువుంది
నిశీధిమేఘం కమ్మేసింది
మౌననిధులే కానుక అంది
.
ఎడారి నడకే తడిమనసునతో
మానని గాయం వెంటే వుంది
సలుపుతున్నది శాంతిని మరచి
సర్దుమణగదేం నిశబ్దంగా
ఎడారి నడకే తడిమనసునతో
మానని గాయం వెంటే వుంది
సలుపుతున్నది శాంతిని మరచి
సర్దుమణగదేం నిశబ్దంగా
.
భావప్రవాహం అక్షరనిధులు
కనుల తటాకం తలపడుతోంది
గాయశిలకే ఊపిరిపోస్తూ
ఆశకు ఆకృతి జోడిస్తోంది.....!!
భావప్రవాహం అక్షరనిధులు
కనుల తటాకం తలపడుతోంది
గాయశిలకే ఊపిరిపోస్తూ
ఆశకు ఆకృతి జోడిస్తోంది.....!!
(15)
కన్నీళ్ళు గెలిచిన నమ్మకo…..
నిన్నలన్నీ మనసులో ప్రయాణిస్తున్నాయి.
నేటి అడుగులకు ఆసరా అవుతూ
మాటాడుకుంటున్న మౌనాలెన్నో
తవ్వుకుంటున్న గాధల్లో.
అక్షరవర్షంలో తడిసిపొతూనే వున్నా...
భావాల ఒడిలో మది దాచుకుంటూ
మౌనమే ఓదార్పయ్యింది ...
ముసుగేసిన బంధాలకు ఎదురెళ్ళలేక.
ఆలంబనౌతోంది అక్షరం
కంటిచెమ్మకు రూపాన్నిస్తూ
కానుకివ్వాలి ఆశకి
కన్నీళ్ళు గెలిచిన నమ్మకాన్ని…..!1
నేటి అడుగులకు ఆసరా అవుతూ
మాటాడుకుంటున్న మౌనాలెన్నో
తవ్వుకుంటున్న గాధల్లో.
అక్షరవర్షంలో తడిసిపొతూనే వున్నా...
భావాల ఒడిలో మది దాచుకుంటూ
మౌనమే ఓదార్పయ్యింది ...
ముసుగేసిన బంధాలకు ఎదురెళ్ళలేక.
ఆలంబనౌతోంది అక్షరం
కంటిచెమ్మకు రూపాన్నిస్తూ
కానుకివ్వాలి ఆశకి
కన్నీళ్ళు గెలిచిన నమ్మకాన్ని…..!1
(16)
||అక్షరాలు నవ్వాయి||
చీకటి తోసెస్తోంది
వెలుగు మెట్లు ఎక్కనివక
మిణుగురులని అడిగాను
కాస్త దారి చూపమని
వెలుగు మెట్లు ఎక్కనివక
మిణుగురులని అడిగాను
కాస్త దారి చూపమని
నిరాశ నను ప్రశ్నిస్తూ
ఎగతాళిగ నవ్వింది
నిర్లిప్తతని అడిగాను
ఆశనాకు నేర్పమని
ఎగతాళిగ నవ్వింది
నిర్లిప్తతని అడిగాను
ఆశనాకు నేర్పమని
మరుపునెంతో అడిగాను
వేదన మానిపించమని
నిశబ్దంగ వెళ్ళింది
మౌనాన్నే అడగమంటు
వేదన మానిపించమని
నిశబ్దంగ వెళ్ళింది
మౌనాన్నే అడగమంటు
గాయాలని అడిగాను
గుండెనొదిలి పొమ్మంటు
జ్ఞాపకాన్ని అడగమంది
నేనేమీ చెప్పలేనంటు
గుండెనొదిలి పొమ్మంటు
జ్ఞాపకాన్ని అడగమంది
నేనేమీ చెప్పలేనంటు
చిరునవ్వుని అడిగాను
చిటికెడు హాసాన్నివ్వమని
చెమరింతను అడగమంది
నేనేమీ చెయ్యలేనని
చిటికెడు హాసాన్నివ్వమని
చెమరింతను అడగమంది
నేనేమీ చెయ్యలేనని
సమధానం దొరకలేదు
ప్రశ్నలన్ని మిగిలాయి
భావాలను పేర్చుకుంటు
అక్షరాలు నవ్వాయి......!!
ప్రశ్నలన్ని మిగిలాయి
భావాలను పేర్చుకుంటు
అక్షరాలు నవ్వాయి......!!
(17)
॥ అనునయం ॥
రెప్పలు మూసిన సముద్రంలో
కదులుతున్న నీళ్ళు వెలికి రాలేక
మదిని మెలి పెట్టిన గతం
చిరునవ్వులు మాయం చేసి
చెంపలపై తచ్చాడే
ఒలికించిన కన్నీళ్ళు
ఉప్పటి నీళ్ళు పెదవిని తడుపుతూ
మింగుడుపడని నిర్లిప్తతలు
గొంతు పెగల్చలేక
ఎక్కిళ్ళవుతున్న ఏడుపులు
జ్ఞాపకాన్ని దాచలేక గద్గదమౌతున్నస్వరం
భావాల పరంపరలో ఒదిగిపోతూ అశ్రువులు
చెమరించే మనసులకూ చేరువవుతూ
తీర్పు చెప్పలేని గురుతులు
భారంగా మారిన వర్తమానాలు
తప్పించు కోలేని రాబోవు కాలాలు
భారమైన క్షణాలు సమయాలను లెక్కిస్తూ
కన్నీటి సముద్రంలో
సందేహ నావలా ప్రయాణం
దాటలేని దు:ఖాల గతం
చెరిగిన ఆశలు కవిత్వమై
హృదయవేదనకు ఆలంబమై
ముసురుకున్న మునుపటి గాయాలకు
మౌనంలో నన్ను నేను
అనునయించు కుంటూ
ఓ ఉదాసీనత ... !!
(18)
తీరంతో స్నేహం.....
మరువలేని స్నేహం తీరంతో నాకెపుడు
ఏదేదో చెపుతూనే వుంటాను
ఎవరికీ చెప్పలేని కన్నీటి కధలెన్నో...
ఏదేదో చెపుతూనే వుంటాను
ఎవరికీ చెప్పలేని కన్నీటి కధలెన్నో...
నీ నీళ్ళు పనికిరాకున్నా
నా కన్నీళ్ళు తుడుస్తావుగా అని
నీ అగాధంలో ముత్యాలు దాగున్నాయేమో
నా మది లోతుల్లో వేదనల సముద్రాలే దాగున్నాయని
నీ చెలిమితో గుండెల్లో దిగిన
బాణాలు మాయమవుతుంటాయని
నా కన్నీళ్ళు తుడుస్తావుగా అని
నీ అగాధంలో ముత్యాలు దాగున్నాయేమో
నా మది లోతుల్లో వేదనల సముద్రాలే దాగున్నాయని
నీ చెలిమితో గుండెల్లో దిగిన
బాణాలు మాయమవుతుంటాయని
నీ సమక్షoలో వీచేగాలి ఆహ్లదమే
ఎన్ని ధూళి కణాలు దాగున్నాయో కదా!
అంతేనా !
ఓదార్పు మంత్రాలెన్ని దాచుంచావో..
ఎన్ని ధూళి కణాలు దాగున్నాయో కదా!
అంతేనా !
ఓదార్పు మంత్రాలెన్ని దాచుంచావో..
తీరం వెంబడి నడుస్తుంటానా
ఉరకలేసే సంతోషాలు కనిపిస్తాయి
పడిలేస్తున్న కెరటాల్లో
పరిగెత్తే ఉత్సాహాలు కనిపిస్తాయి
ఉరకలేసే సంతోషాలు కనిపిస్తాయి
పడిలేస్తున్న కెరటాల్లో
పరిగెత్తే ఉత్సాహాలు కనిపిస్తాయి
భారంగానే నాఆడుగులు నడుస్తుంటె
వెనుక నడకలు తుడిచేసే కెరటాలు
వెనుకేమీ లేదని చెప్పినట్లు
బరువులన్నీ దిగిపోయినట్లు
ఆశ్చర్యాలే నాకపుడు
వెనుక నడకలు తుడిచేసే కెరటాలు
వెనుకేమీ లేదని చెప్పినట్లు
బరువులన్నీ దిగిపోయినట్లు
ఆశ్చర్యాలే నాకపుడు
తీరంలో పాదాలు తడిపి వొస్తానా?
కొన్ని ఇసుక రేణువులు నావెంటే
అలాఇంటిదాకా
మెమున్నాం అంటూ తోడుగా
విసుగేమీ వుండదు
మళ్ళీ సముద్రాన్ని పలుకరించేదాకా
కొన్ని ఇసుక రేణువులు నావెంటే
అలాఇంటిదాకా
మెమున్నాం అంటూ తోడుగా
విసుగేమీ వుండదు
మళ్ళీ సముద్రాన్ని పలుకరించేదాకా
కెరటం వెదజల్లిన నీళ్ళలో కన్నీటి కలిపేశాను
తిరిగొచ్చిన పాదాలను ఆ ఇసుకను చూసి అనిపిస్తుంది
సముద్రం మనసులో వెంటే వుందని....!!
తిరిగొచ్చిన పాదాలను ఆ ఇసుకను చూసి అనిపిస్తుంది
సముద్రం మనసులో వెంటే వుందని....!!
(19)
|| అక్షరాలకు అందమద్దుతూ .....||
అప్పటి ఆ దృశ్యం కంటిముందింకా
కదలాడుతూనే వుంది
చీకటి చారికలో చుట్టేసి
చిరునవ్వుకు నల్లరంగు పులిమేసి
అదిగో ఇప్పుడూ
ఆ దృశ్యం వెంటాడుతోంది వీడిపోని నీడలా..
...
కదలాడుతూనే వుంది
చీకటి చారికలో చుట్టేసి
చిరునవ్వుకు నల్లరంగు పులిమేసి
అదిగో ఇప్పుడూ
ఆ దృశ్యం వెంటాడుతోంది వీడిపోని నీడలా..
...
ఓడిన ఆ సంఘటన
గుబులు గుండెను మోసుకుంటూ..
ఇంకా కనుల ముందు నడుస్తూనేవుంది..
...
గుబులు గుండెను మోసుకుంటూ..
ఇంకా కనుల ముందు నడుస్తూనేవుంది..
...
మనసంతా నిశలు నిండి వున్నా
వేకువ వెలుగులు వెలి వేస్తున్నా
వెన్నెలనే చూస్తున్నా
మది చీకటి చెరిపేద్దామని
...
వేకువ వెలుగులు వెలి వేస్తున్నా
వెన్నెలనే చూస్తున్నా
మది చీకటి చెరిపేద్దామని
...
ఎన్ని కలలో కదా..
ఓడాక కానీ తెలియలేదు
కరిగే చీకటికీ
పెరిగే వెన్నెలకై వేచి చూస్తూ ..
...
ఓడాక కానీ తెలియలేదు
కరిగే చీకటికీ
పెరిగే వెన్నెలకై వేచి చూస్తూ ..
...
సంతోషాలు కురిసిన నిన్నలు
నిఘా వేసేవుంది నేటిపై కూడా
అదే గాయమే
...
నిఘా వేసేవుంది నేటిపై కూడా
అదే గాయమే
...
నిష్క్రమించిన నవ్వులనైనా ..
వెల్లువెత్తిన వేదనైనా ...
భావాలు ఒంపుతూ
అక్షర సేద్యం చేయిస్తూ
ఊరడించే ఉదయకాంతి వెతుక్కోమంది
...
వెల్లువెత్తిన వేదనైనా ...
భావాలు ఒంపుతూ
అక్షర సేద్యం చేయిస్తూ
ఊరడించే ఉదయకాంతి వెతుక్కోమంది
...
ఆశ్రువులతోనే ఆడుకుంటున్నా
అక్షరాలకు అందమద్దుతూ..
...
అక్షరాలకు అందమద్దుతూ..
...
ఘాటుగా తగిలిన గాయాన్ని
అక్షర సమక్షంలోనే ఆర్పు కుంటున్నా
...
అక్షర సమక్షంలోనే ఆర్పు కుంటున్నా
...
చెమరించేకన్నులను నిలదీస్తున్నాయి
ఆగిపోమంటూ నా అక్షరాలే ...
...
ఆగిపోమంటూ నా అక్షరాలే ...
...
కాంతి నింపి కనుపాపతో
కబుర్లు చెప్పాలని వుంది
కాసేపిలా రావూ.....!!
కబుర్లు చెప్పాలని వుంది
కాసేపిలా రావూ.....!!
(20)
అక్షరాల సమక్షం….
వెంటాడే జ్ఞాపకాలే అన్నీ ...
నిన్నలన్నీ నేటిలోకి తొంగిచూస్తూ
నిత్యమైన చెలిమే చెక్కిలితో
తేరు కుంటోంది ఓ గాయం
అక్షయమైన అశ్రువుల అంతిమానికై
అక్షరాల సమక్షంలోనే సేద దీరుతూ
అనుభూతుల తాయిలం
అందితే బావుండు.
తలడిల్లు తలపుల్ని ….!!
నిన్నలన్నీ నేటిలోకి తొంగిచూస్తూ
నిత్యమైన చెలిమే చెక్కిలితో
తేరు కుంటోంది ఓ గాయం
అక్షయమైన అశ్రువుల అంతిమానికై
అక్షరాల సమక్షంలోనే సేద దీరుతూ
అనుభూతుల తాయిలం
అందితే బావుండు.
తలడిల్లు తలపుల్ని ….!!
తుడిచేసుకుందుకు..!!.
(21)
||తెగిన బంధపు తీగకు వేలాడుతూ…………||
తెగిన బంధపు తీగకు వేలాడుతూ
ఆరని వేదనతో అల్లాడుతూనే వున్నాను
అశ్రువులు అక్షరాలుగా మారుస్తూ
తల్లడింపుతో తనకలాడుతూనే వున్నాను
ఆరని వేదనతో అల్లాడుతూనే వున్నాను
అశ్రువులు అక్షరాలుగా మారుస్తూ
తల్లడింపుతో తనకలాడుతూనే వున్నాను
ఒలుకుతున్న కన్నీటిలో
నీ రూపాన్నిచుస్తూ
నిదురలేని నిరాశ మనసు
మూగతో మాటాడుతోంది
నీ రూపాన్నిచుస్తూ
నిదురలేని నిరాశ మనసు
మూగతో మాటాడుతోంది
వెగటు జీవితం వెక్కిరిస్తోంది
గతమంతా గాయపు పొరలు
తెగిపోని కన్నీటి పొరలు
కొత్త తెరలు తీయలేను
గతమంతా గాయపు పొరలు
తెగిపోని కన్నీటి పొరలు
కొత్త తెరలు తీయలేను
కొసకు చేరవు కన్నీళ్ళు
ఆఖరిని అందుకోలేక అశ్రువులు
గుండెల్లో మిగిలిన గాయం
ఆకిందనే ఆగిన ఆ నవ్వులు
ఆఖరిని అందుకోలేక అశ్రువులు
గుండెల్లో మిగిలిన గాయం
ఆకిందనే ఆగిన ఆ నవ్వులు
అపుడు పడ్డ వేదన
ఇంకా కంటిముందే దీన ద్రశ్యమై
నా మీద నాకే జాలిగా
పేగు పగిలిన శబ్దమై వినిపిస్తూ
రాలిపోతే బావుండని........!!
ఇంకా కంటిముందే దీన ద్రశ్యమై
నా మీద నాకే జాలిగా
పేగు పగిలిన శబ్దమై వినిపిస్తూ
రాలిపోతే బావుండని........!!
(22)
నిత్య నివేదన....
నిశ్చల జ్ఞాపకాలు నిత్యం భారంగా
ఇంకిపోని గుండెలోని నీరు
చీకటికై ఎదురుచూస్తూ
ఒలకాలని ఆత్రంతో
ఏ నడి రాతిరో
కన్నీళ్ళ కళ్ళాపి చల్లుతాయి కాగితంపై
కొంత దిగులు అక్షరాల్లొ ఒలికి
మరికొంత వేచి చూస్తూ
నిత్య నివేదన కన్నీళ్ళు చీకటికి
తడిచిన తలగడ సాక్ష్యమే ప్రోద్దుటికి
ఆరబెట్టుకుందుకు భానుడికి స్వాగతమంటాయి
రెప్పమూయ లేని దు:ఖం రేయిలో
బాధ్యతల ఉలికిపాటు వేకువలో…!!
ఇంకిపోని గుండెలోని నీరు
చీకటికై ఎదురుచూస్తూ
ఒలకాలని ఆత్రంతో
ఏ నడి రాతిరో
కన్నీళ్ళ కళ్ళాపి చల్లుతాయి కాగితంపై
కొంత దిగులు అక్షరాల్లొ ఒలికి
మరికొంత వేచి చూస్తూ
నిత్య నివేదన కన్నీళ్ళు చీకటికి
తడిచిన తలగడ సాక్ష్యమే ప్రోద్దుటికి
ఆరబెట్టుకుందుకు భానుడికి స్వాగతమంటాయి
రెప్పమూయ లేని దు:ఖం రేయిలో
బాధ్యతల ఉలికిపాటు వేకువలో…!!
(23)
|| అనిశ్చితం....||
కలత మనసులో కరుగుతున్న కాలంలో
కనులుజార్చు నీటిలో కధనాలు ఎన్నో
కనులుజార్చు నీటిలో కధనాలు ఎన్నో
మార్పుతెచ్చిన గమనాలు దు:ఖాలు మోస్తూనే
భారమైన గతాలలో భంగపడ్డ సందర్భాలెన్నో
భారమైన గతాలలో భంగపడ్డ సందర్భాలెన్నో
కుప్పకూలిన మనసుకు
చేయూతందించక
విదిలించిన ఆత్మీయతలు
విసుక్కున్న క్షణాలెన్నొ
చేయూతందించక
విదిలించిన ఆత్మీయతలు
విసుక్కున్న క్షణాలెన్నొ
ఆత్మవిశ్వాసాలపై నీళ్ళుచల్లే
అతిమంచితనాలు
మమతలద్దని బంధాల
వేర్పాటు వాదాలెన్నో
అతిమంచితనాలు
మమతలద్దని బంధాల
వేర్పాటు వాదాలెన్నో
చూపులకతిశయమైన
అక్షరాల ఓదార్పులు
మౌనద్వేషాలు ప్రకటించిన
అనుబంధాలెన్నో
అక్షరాల ఓదార్పులు
మౌనద్వేషాలు ప్రకటించిన
అనుబంధాలెన్నో
చెక్కుకున్న నవ్వులకు
ఎదురయ్యే విరుపుల చికాకులు
బలవంతపు మాటల్లో
భేషజాలెన్నో
ఎదురయ్యే విరుపుల చికాకులు
బలవంతపు మాటల్లో
భేషజాలెన్నో
తీరిన అవసరాలు
మనసులు మరచిన ఆ గుర్తులు
శేష ప్రశ్నగా మిగిలిన
చెమట చుక్కల గుర్తులెన్నో
మనసులు మరచిన ఆ గుర్తులు
శేష ప్రశ్నగా మిగిలిన
చెమట చుక్కల గుర్తులెన్నో
గుండెనోదలని గాధలు,
జ్ఞాపకం కార్చిన కన్నీటి చుక్కలు
అక్షరాలొలికె అమ్మ ప్రేమతో
మౌనం పలికే భావాలెన్నో ....!!
జ్ఞాపకం కార్చిన కన్నీటి చుక్కలు
అక్షరాలొలికె అమ్మ ప్రేమతో
మౌనం పలికే భావాలెన్నో ....!!
(24)
!! కాంతి కావాలనిపిస్తూ.....!!
జ్ఞాపకాల పుటలు విచ్చుకుంటున్నాయి
గమనాలను బంధిస్తూ
గమనాలను బంధిస్తూ
నిట్టూర్పుల నవ్వులలో గుర్తులోలుకుతున్నాయి
కాలాన్ని భారంగా మోస్తూ
కాలాన్ని భారంగా మోస్తూ
ప్రశ్నార్ధక వందనంలో
జవాబు దొరకడం లేదు
జవాబు దొరకడం లేదు
చీకటి చిక్కుముడి విప్పలేక
వెన్నెల చుక్కలకై వేటాడుతున్నా
వెన్నెల చుక్కలకై వేటాడుతున్నా
నిశల నిధులను కప్పెట్ట లేక
చెకుముకి రాళ్ళ కై వెతుక్కుంటున్నా
చెకుముకి రాళ్ళ కై వెతుక్కుంటున్నా
తిమిరాలలో తడిసిపొతూ
కాంతి కిరణాలకై తపిస్తున్నా
కాంతి కిరణాలకై తపిస్తున్నా
శోధనలో
సాధనకై
స్పష్టత సంక్లిష్టమై
సాగిపోతున్నాయి సమయాలు
సవరణలు స్వాగతిస్తూ ...!!
సాధనకై
స్పష్టత సంక్లిష్టమై
సాగిపోతున్నాయి సమయాలు
సవరణలు స్వాగతిస్తూ ...!!
(25)
మౌన గాయo .........
మౌన వేదనలో మమతలకు దూరమై
నిదుర మరచి గెలవలేని స్వప్నాన్నై
విధి లిఖించిన ఓటమికి బానిసనై
చీకటిలో చిలికే అక్షరాన్నై
మది సంఘర్షణతో పోరాడే సమిధనై
గాయాల గుదిబండకు తడబడే అడుగునై
మూతపడని రెప్పల చప్పుడుకు ఓడిన కలనై
జ్ఞాపకాల్లో మిగిలిన ఆనవాళ్ళు మోసే వ్యధనై
కనులు సముద్రాలలో తేలియాడే అలనై
మదిన శాంతి లేని కలతనై
వ్యధల కన్నీరు మోసే కలకంఠినై
చేజారినా నవ్వులు.. ఆగిపోని ఊపిరినై
చేయి చాచి తపించే చెమరింతనై
మిగిలివున్న మౌన గాయాన్ని .....!!
నిదుర మరచి గెలవలేని స్వప్నాన్నై
విధి లిఖించిన ఓటమికి బానిసనై
చీకటిలో చిలికే అక్షరాన్నై
మది సంఘర్షణతో పోరాడే సమిధనై
గాయాల గుదిబండకు తడబడే అడుగునై
మూతపడని రెప్పల చప్పుడుకు ఓడిన కలనై
జ్ఞాపకాల్లో మిగిలిన ఆనవాళ్ళు మోసే వ్యధనై
కనులు సముద్రాలలో తేలియాడే అలనై
మదిన శాంతి లేని కలతనై
వ్యధల కన్నీరు మోసే కలకంఠినై
చేజారినా నవ్వులు.. ఆగిపోని ఊపిరినై
చేయి చాచి తపించే చెమరింతనై
మిగిలివున్న మౌన గాయాన్ని .....!!
(26)
No comments:
Post a Comment