Friday, 12 June 2015

 గజల్ ........

నిశబ్ధమే మదినంతా ఏలుతోంది  మౌనాలలో ॥ 
మాటలన్ని భావాలుగ మార్చుతోంది కవితలలో ॥ 

ఆకశాన్ని పలుకరించె మనసులోని ఆలోచన 
శూన్యమే స్నేహంగా పలుకుతోంది పవనాలలో ॥ 

నీప్రేమలె కురిసె నాలొ తడుపుతున్న జడివానగ 
సంతోషపు సవ్వడియే ఒలుకుతోంది పదములలో ॥ 

నిన్నలనే మరువలేని నిశలుగానె మిగిలాయి 
మెల్కొల్పుతు ఉషోదయం కురుస్తోంది ఆశలలో ॥ 

కడలిలోని నీరంతా అలలతోన పలుకరిస్తూ 
ఆశనింపు ధైర్యాలను నేర్పుతోంది కెరటాలలో ॥ 

మధుర'వాణి' ఎదురుచూపు మిగులుతోంది నిరాశగా
కొత్తపదం వెన్నుతట్టి లేపుతోంది  లాలనలో ॥ 

......... వాణి ,13 జూన్ 15 

Thursday, 11 June 2015

॥ మనసు ఎలా ఒప్పిందో... ॥ 

నన్ను విడిచి వెళ్లేందుకు మనసు ఎలా ఒప్పిందో ॥ 
నీ బాధ్యతా మరిచెందుకు మనసు ఎలా ఒప్పిందో  ॥ 

వెనుకెనుకకు నీ అడుగులు మరలి వెళ్లి పోయాయి 
అమ్మనొదలి మరలేందుకు మనసు ఎలా ఒప్పిందో  ॥ 

ఎన్నెన్నో కోరికలను నాముందర పరచుంచి 
జ్ఞాపకాలుగా మిగిల్చెందుకు మనసు ఎలా ఒప్పిందో  ॥  

చిరునవ్వుల నీ బాల్యం కలగానే మిగిల్చెసి 
మాయమై పోయేందుకు మనసు ఎలా ఒప్పిందో  ॥  

నీవులేని ప్రపంచం నిర్లిప్తంగ కనిపిస్తూ 
మదినితడితో నింపెందుకు మనసు ఎలాఒప్పిందో   ॥ 

నీ'వాణి'యె వినిపించక గాయాలను రేపెడుతు 
కంటి చెలమలో తోసెందుకు మనసు ఎలాఒప్పిందో  ॥ 

......... వాణి 

Wednesday, 10 June 2015

॥ అందులకే  ॥ 

మనసంతా మౌనంతో నింపినాను అందులకే  ॥ 
ఊహలనే భావాలుగ మార్చినాను అందులకే  ॥ 

చెప్పలేని ఆశలేవో హృదయంలో దాచుకునీ 
పరశించు  ప్రేమలుగా పరచినాను అందులకే  ॥ 

చేరదీయు నీమదియే నేనేలే సామ్రాజ్యం 
మరువలేని అనుభూతులు దాచినాను అందులకే  ॥ 

స్వగతాలు స్వప్నాలు హృదిలోని  ఆకాంక్షలు 
పలుకరించు  నవ్వులన్ని దోచినాను అందులకే  ॥ 

నీకోసమె నామనసే పుష్పముగా వికసించెను 
తుమ్మెదవై నీరాకకు వేచినాను అందులకే  ॥ 

మధురవాణి ఎదలోపల విహరింతలు నీవేలే 
నీ జతగా ఎగరాలని కోరినాను అందులకే ॥ 


....వాణి 

Tuesday, 9 June 2015

గజల్ ...............
ఆకశాన వెల్లివిరిసె సప్తవర్ణ ఇంధ్రధనువు ॥
నింగిశిఖనె నిండిమెరిసె సప్తవర్ణ ఇంధ్రధనువు ॥
సంబరంకి హద్దులేదు చూచితరచి అభిలషించి
రంగులద్ది తడిసిమెరిసె సప్తవర్ణ ఇంధ్రధనువు ॥
మనసుఎంతొ మురిసిపోతు అంబరాన్నె ఆవహించె
జ్ఞాపకాల్లొ తడిపివిరిసె సప్తవర్ణ ఇంధ్రధనువు ॥
వర్ణమయమె ఊహలన్ని బాల్యానికి మరలివెళ్ళెను
పసితనాలు తట్టికురిసె సప్తవర్ణ ఇంధ్రధనువు ॥
కాంతినింపి ఆశలన్ని హిమముగానె రాలిపడెను
మధుర'వాణి' మదినమెరిసె సప్తవర్ణ ఇంధ్రధనువు ॥
...వాణి

Friday, 5 June 2015

నీరునిండుగ పారకుంటే పాడిపంటకు చోటులేదు ||
ఆశవిత్తులు నాటకుంటే బతుకుపంటకు చోటులేదు ||
ఆడపిల్లలు మరుగె అయితే జీవిపుట్టుక సాధ్యమౌనా
పురిటినొప్పులు భారమంటే మరోజన్మకు చోటులేదు ||
పుడమిపచ్చగ వెలగకుంటే కలుషితమేగ ప్రకృతి అంతా
చెట్టుప్రగతిని పెంచకుంటే భవిష్యత్తుకు చోటులేదు||
మధురమైనదె మట్టివాసన కాంక్రీటుతో కప్పిపెడుతూ
నేలపైననె కొన్ని మొక్కలు జీవనమునకు చోటులేదు ||
మంచినీటికి స్వచ్చగాలికి నోచుకోక భావిజనులు
ప్రకృతి శక్తి నిర్వీర్యమైతె ప్రశాంతతకు చోటులేదు||
సహజ ప్రకృతి సౌందర్యమే కవులకల్పనగ మిగిలిపోవున
పర్యావరణం నిర్లక్షిస్తే మనిషిమనుగడకు చోటులేదు ||
...వాణి, 5 జూన్ 15

Monday, 1 June 2015

|| నీకోసం ॥

చిరుదివ్వే తోడురాగ తచ్చాడుతు  నీకోసం ॥
కెరటాలే వెంటరాగ తారాడుతు నీకోసం ॥

జలనిధిలో గాలిస్తూ ఆచితూచి అడుగేస్తూ 
కోరుకుంటు నీస్పర్శలె వెతుకాడుతు నీకోసం ॥

చీకటంత మరుగౌవగ  వేకువనే మేల్కొపుతు 
చేరాలని నీజాడను తడబడుతూ నీకోసం ॥

ఏదేదో ఆలోచన ఎంతెంతో ఆవేదన 
గుబులెంతో గుండెలోన చింతించుతు నీకోసం ॥

రేయి లేదు జాము లేదు చెమరించే కనులెతోడు 
మౌనాలతొ మాటాడుతు గాలించుతు నీకోసం॥  

జాప్యమేల ప్రియతమా చేరరావ నాదరికి 
అడుగులెంత బరువైనా తిరుగాడుతు నీకోసం॥  

వినపడనీ 'వాణి'యలే కనపడనీ జాడలులే 
దిక్కులన్ని చూపులతో పరికించుతు నీకోసం॥  



...... వాణి 

॥ హృదయం॥
ఏ మౌనం మాటాడితె స్పందించెనొ నా హృదయం ॥ 
ఏ పుష్పం  పరిమళముతొ పులకించెనొ నా హృదయం॥  

నీపెదవుల పలుకరించ అలలహోరు ఎడదలోన 
ఏ ప్రణయపు ఆవిరులను స్పర్శించెనొ నా హృదయం ॥ 

విహరించే మనసంతా నీధ్యాసల మొహంతో 
ఏ నిశబ్ద రాగాలను ఒలికించెనొ నా హృదయం ॥ 

నీవులేని వెలితితోన జాబిలితో ఊసులెన్నో 
ఏ కాంతి కిరణాలను శోధించెనొ  నా హృదయం ॥ 

మధుర'వాణి' నాట్యాలే మయూరాన్ని తలపింపగ 
ఏమార్పుతొ పరవసించి అలరించెనొ నా హృదయం॥ 

....వాణి