॥ మనసు ఎలా ఒప్పిందో... ॥
నీ బాధ్యతా మరిచెందుకు మనసు ఎలా ఒప్పిందో ॥
వెనుకెనుకకు నీ అడుగులు మరలి వెళ్లి పోయాయి
అమ్మనొదలి మరలేందుకు మనసు ఎలా ఒప్పిందో ॥
ఎన్నెన్నో కోరికలను నాముందర పరచుంచి
జ్ఞాపకాలుగా మిగిల్చెందుకు మనసు ఎలా ఒప్పిందో ॥
చిరునవ్వుల నీ బాల్యం కలగానే మిగిల్చెసి
మాయమై పోయేందుకు మనసు ఎలా ఒప్పిందో ॥
నీవులేని ప్రపంచం నిర్లిప్తంగ కనిపిస్తూ
మదినితడితో నింపెందుకు మనసు ఎలాఒప్పిందో ॥
నీ'వాణి'యె వినిపించక గాయాలను రేపెడుతు
కంటి చెలమలో తోసెందుకు మనసు ఎలాఒప్పిందో ॥
......... వాణి
No comments:
Post a Comment