Friday, 12 June 2015

 గజల్ ........

నిశబ్ధమే మదినంతా ఏలుతోంది  మౌనాలలో ॥ 
మాటలన్ని భావాలుగ మార్చుతోంది కవితలలో ॥ 

ఆకశాన్ని పలుకరించె మనసులోని ఆలోచన 
శూన్యమే స్నేహంగా పలుకుతోంది పవనాలలో ॥ 

నీప్రేమలె కురిసె నాలొ తడుపుతున్న జడివానగ 
సంతోషపు సవ్వడియే ఒలుకుతోంది పదములలో ॥ 

నిన్నలనే మరువలేని నిశలుగానె మిగిలాయి 
మెల్కొల్పుతు ఉషోదయం కురుస్తోంది ఆశలలో ॥ 

కడలిలోని నీరంతా అలలతోన పలుకరిస్తూ 
ఆశనింపు ధైర్యాలను నేర్పుతోంది కెరటాలలో ॥ 

మధుర'వాణి' ఎదురుచూపు మిగులుతోంది నిరాశగా
కొత్తపదం వెన్నుతట్టి లేపుతోంది  లాలనలో ॥ 

......... వాణి ,13 జూన్ 15 

No comments:

Post a Comment