Wednesday, 10 June 2015

॥ అందులకే  ॥ 

మనసంతా మౌనంతో నింపినాను అందులకే  ॥ 
ఊహలనే భావాలుగ మార్చినాను అందులకే  ॥ 

చెప్పలేని ఆశలేవో హృదయంలో దాచుకునీ 
పరశించు  ప్రేమలుగా పరచినాను అందులకే  ॥ 

చేరదీయు నీమదియే నేనేలే సామ్రాజ్యం 
మరువలేని అనుభూతులు దాచినాను అందులకే  ॥ 

స్వగతాలు స్వప్నాలు హృదిలోని  ఆకాంక్షలు 
పలుకరించు  నవ్వులన్ని దోచినాను అందులకే  ॥ 

నీకోసమె నామనసే పుష్పముగా వికసించెను 
తుమ్మెదవై నీరాకకు వేచినాను అందులకే  ॥ 

మధురవాణి ఎదలోపల విహరింతలు నీవేలే 
నీ జతగా ఎగరాలని కోరినాను అందులకే ॥ 


....వాణి 

No comments:

Post a Comment