గజల్ ...........
మదిదాచిన పలుకులన్నిమౌనానికి ని వేదనం ॥
మాటలన్ని నిశబ్దించి భావానికి నివేదనం ॥
కోవెలలో వరములిచ్చు దైవానికి నివేదనం ॥
నిదురరాని రేయంతా మదినఎంత దిగులున్నా
కొత్తఆశ నింపుతున్న ఉదయానికి నివేదనం ॥
మరుగైనది గుండెదిగులు ప్రేమపంచు నేస్తంతో
వెలికొచ్చిన నవ్వులన్ని స్నేహానికి నివేదనం ॥
మమతపంచు అక్షరాలు పలుకుతున్న భావాలు
నిర్మలమై మనసంతా కవనానికి నివేదనం ॥
గుండెనొదలి పోలేనీ మదినదాగి కలతలన్ని
మౌన 'వాణి' బాధలన్ని కాలానికి నివేదనం ॥
పరిమళించు సాహిత్యం సమకూర్చిన సంగీతం
గళాలలో ప్రభవించి గానానికి నివేదనం
.....వాణి
No comments:
Post a Comment