గజల్.............
మనసుపలికే అశ్రుగీతం కుమిలిపోతూ కురుస్తున్నది ॥
నదులనీటిని ప్రేమపంచుతు జలధినీటితొ ఆదరిస్తూ
పరిధిపెంచీ పరవశంతో ఇమిడిపోతూ కలుస్తున్నది ॥
చింతలన్నీ చేరువౌతూ నవ్వులన్నీ ఎగిరి పోయెను
దూరమయ్యెను పలుకుయేదో పగిలిపొతూ మరుస్తున్నది ॥
కరువులేనీ కంటనీరుని కలుపుకున్నది సంద్రమే
గాయ శిలనే హత్తుకుంటూ కరిగిపోతూ తుడుస్తున్నది ॥
ఉనికిసైతం మాసిపోయెను దు:ఖనీడలు కమ్ముకొనగా
తోడువదిలెను బంధమొకటి మరచి పోతూ విడుస్తున్నది ॥
అందలేదూ ఆత్మీయహస్తం విరుపుకుంపటి రగులుతూ
మౌన 'వాణీ' కనులనీటిలొ తడిసిపోతూ వచిస్తున్నది ॥
......వాణి
No comments:
Post a Comment