గజల్..................
కలతలే కంటిలో కురవడం హాయిలే ||
గుండెలో బాధనే తొలగడం హాయిలే ||
గుండెలో బాధనే తొలగడం హాయిలే ||
మాటనే మౌనమై పలుకుతూ మనసుతో
నన్ను నే చెలిమిగా తాకడం హాయిలే ||
నన్ను నే చెలిమిగా తాకడం హాయిలే ||
నీ వంత దూరమై కలలనే ఓడుతూ
కొత్తగా కానుకై చేరడం హాయిలే ||
కొత్తగా కానుకై చేరడం హాయిలే ||
ఉదయాల ఆశేదొ తలుపునే తట్టగా
రేయిలో స్వప్నమే మెరవడం హాయిలే ||
రేయిలో స్వప్నమే మెరవడం హాయిలే ||
నిన్నంతా వెన్నెలే నేటిలో నిశలులే
చూపులో వెలుగులే వెతకడం హాయిలే ||
చూపులో వెలుగులే వెతకడం హాయిలే ||
మమతగా వాణినే నింపుతూ ఉండవా
నీ ప్రేమ గుండెల్లో నిండడం హాయిలే ||
నీ ప్రేమ గుండెల్లో నిండడం హాయిలే ||
........వాణి,14/15
No comments:
Post a Comment