॥ లోటులేదు॥
మొలకలన్నీ చిగురుతొడిగితె జీవితానికి లోటులేదు॥
నేలమురిసెను చినుకుతడులతొ పల్లవించెను తరువులన్నీ
పంటపొలాల పచ్చదనంతొ ధాన్యరాశికి లోటులేదు ॥
ఆత్మశోధన అవసరములే ప్రతిమనిషికి సమాజములో
పరిమళించని ప్రకృతి శక్తుల నిరాదరణకి లోటులేదు ॥
దగ్గరితనం దూరమయ్యీ స్పర్శలవర్షం కావాలని
మనసులోగిలి కోరుకుంటూ వియోగాలకి లోటులేదు ॥
నిశలుతడుపుతు హృదయమంత భారమాయెను జీవితములో
తట్టిలేపెడి జ్ఞాపకాలలో విషాదాలకి లోటులేదు॥
ఎదురొచ్చేటి దారులన్నీ ఆశలతివాచీలు పరచీ
మనసుఎంతో తుళ్ళిపడుతూ సంతసానికి లోటులేదు॥
మధుర'వాణీ' అంతరంగం విహరించేను స్వప్నలోకం
గెలుచుకుంటే కలలజగమే సంబరానికి లోటులేదు॥
..... వాణి
No comments:
Post a Comment