॥ ఎవ్వరో॥
నా మదిలో సౌందర్యం మలచిందీ ఎవ్వరో ॥
నిన్నునేను పూర్తిగా గెలవలేక పోయాను
నీవునాకు కాకుండా దోచిందీ ఎవ్వరో ॥
నన్నునీలో నిలుపలేక భ్రాంతితోనె మిగిలాను
వేదనలో రోదనలో తోసిందీ ఎవ్వరో ॥
శ్వాశ్వితముగ నీ హృదిలో నిలవాలని భావించా
నా బాటకు అంతరాయం చేసిందీ ఎవ్వరో ॥
ప్రియసఖియ మనోరధము నాదేనని తెలుసులే
నిర్బంధపు బంధనాన్ని గెలిచింది ఎవ్వరో ॥
.....వాణి
No comments:
Post a Comment