పుడమి పచ్చటి తరువుహారం నింపుకుంటే ఎంత హాయి
చెట్లప్రగతికి మనుష్యులంతా పూనుకుంటే ఎంత హాయి
మౌనఘోషే మట్టికణంకి మధురవాసన మూసిపెడుతూ
తడిసిమురిసే వానచినుకును గెలుచుకుంటే ఎంత హాయి
పరిమితిదాటి ఎండవానలు మనుగడకూడ పెనుభారమె
సహజవనరులే ధ్వంశమవక నిలుపుకుంటే ఎంత హాయి
అవనితల్లిని ఆవహించెను ప్లాష్టికనే పెనుభూతము
మట్టిపాత్రకు ప్రాధాన్యమిస్తూ వాడుకుంటే ఎంత హాయి
వాహనాలే పెరిగిపోయెను కలుషితమై గాలిసైతం
ఒకరికొకరుగ సహకరిస్తూసాగుతుంటే ఎంత హాయి
........వాణి
No comments:
Post a Comment