గజల్ ....
జ్ఞాపకాల బాసలన్నీ కురిసి వెళ్ళి పోతావు ॥
నన్నువదలి వెళ్ళావుగ మోడుగానె మిగిలాను
నా ప్రేమల ధ్యాసలలో తడిసి వెళ్ళి పోతావు ॥
ఏలోకం నీదైనా నాలోకం నీ దేనని
ఊహలలో తొంగిచూసి మురిసి వెళ్ళిపోతావు ॥
కంటి ముందు నీరూపం కదిలినట్లు ఉంటుంది
తాకాలని తడమగానె ఎగసి వెళ్ళిపోతావు ॥
పలుకరించు పరిసరాల సడులేమీ వినపడవు
ఎదలోతును తట్టిలేపి కలిసి వెళ్ళిపోతావు ॥
జాబిలిలో చుక్కలలో నీ రూపం కనిపిస్తే
కనులార్పక చూస్తుంటే మెరిసి వెళ్ళిపోతావు ॥
మధురమైన నీ 'వాణీ' ఎదలోతున వినపడుతూ
గుండె గుచ్చు గాయంగా తడిసి వెళ్ళిపోతావు ॥
........... వాణి
No comments:
Post a Comment