॥ గజల్ ॥
నీజాడకు తారాడుతూ మౌనంగా వెతికాను ॥
మనసంతా శూన్యంగా అంబరాన్ని గాలిస్తూ
కలతచెంది కన్నీటితొ గాయంగా వెతికాను ॥
ఏడేడూ లోకాలలొ నీ ఉనికే తెలియకుంది
తనువంతా కనులు చేసి కలవరంగ వెతికాను ॥
అందమంత నీదేగా అలంకరణ నీకేగా
అలసిసొలసి సొమ్మసిల్లి భారంగా వెతికాను॥
మనసులోన నీరూపం నింగిలోన నిశబ్దాలు
మబ్బులనూ తొలగిస్తూ వేదనగా వెతికాను ॥
గుండెఎంతొ బరువౌతూ నీవులేని వెలితౌతూ
ఆదేవుని ప్రార్ధిస్తూ గానంగా వెతికాను ॥
చీకటినీ చూపిస్తూ మబ్బులన్ని కమ్ముకుంటు
మనసంతా ముంచుతున్న దు:ఖంగా వెతికాను ॥
మధురవాణి మౌనప్రేమ నీదేనని చెప్పాలని
మనసులోన మమతనింపి కోరికగా వెతికాను ॥
....వాణి
No comments:
Post a Comment