గజల్ ........
రవితేజం ఆకశాన మెరిసినట్లు ఉందిలే ॥
సుప్రభాత సుమాలన్ని వికసిస్తూ చిరునవ్వుతో
మనసంతా ఉల్లాసం పంచినట్లు ఉందిలే ॥
తారాడుతు భ్రమరాలే విరితేనెకు వెదుకుతూ
పువ్వులపై వాలగానె మురిసినట్లు ఉందిలే ॥
జ్ఞాపకాల వనములోన విహరించెను మనసేమో
గురుతులన్నీ గేయాలుగా మారినట్లు ఉందిలే ॥
మధుర'వాణి' మౌనపలుకు కవనంలో పంచుతోంది
అనుభవమే భావంగా ఒలికినట్లు ఉందిలే ॥
....వాణీ
No comments:
Post a Comment