॥ ఒక్కసారి ॥
మమతపంచి నిన్నునీవు మార్చుకో ఒక్కసారి
మదినసలుపు గాయమేది మాసిపోదు సహజమే
సవరణలతొ నీమనసుతొ సర్దుకుపో ఒక్కసారి
చేరదీయు చైతన్యమె చెంతచేరును ఎప్పుడో
కాలానికి వేచివుండి సాధించుకొ ఒక్కసారి
దూరమైన క్షణాలేవి తిరిగిదరికి చేరవులే
సాధించే ఆశయాలె పేర్చుకో ఒక్కసారి
సాధనలో గెలవలేని విషయమేమీ ఉండదు
అవమానపు గాయమైన ఓదార్చుకొ ఒక్కసారి
...వాణి
No comments:
Post a Comment