॥ వెళ్ళావు ॥ గజల్
మదిచాటున మమతలన్ని దాచుకుంటు వెళ్ళావు
మరువలేని జ్ఞాపకాలు ఒంపుకుంటు వెళ్ళావు !!
అలుకలేవొ వెలిబుచ్చుతు దాటుకుంటు వెళ్ళావు!!
గుండెతలుపు తెరుచుంచీ ఆహ్వానం నాకంటూ
హృదిలోకి రారమ్మని వేడుకుంటు వెళ్ళావు !!
వెలుగుపంచు దేవుడవని నీపైననె ఆరాధన
కారణమే చెప్పకుండ కోపమంటు వెళ్ళావు!!
పగలనకా రాత్రనకా నీకోసమే ఎదురుచూపు
మెరుపులాగ కనులముందు నవ్వుకుంటు వెళ్ళావు!!
నానవ్వుల పువ్వులన్ని నీముంగిట పరిచానూ
వేకువనే ఒక్కొక్కటి ఏరుకుంటు వెళ్ళావు!!
మయూరంల నానర్తన తన్మయమే అన్నావూ
మధుర 'వాణి' మాటలతో మెచ్చుకుంటు వెళ్ళావు!!
....వాణి ,25 march 15
No comments:
Post a Comment