॥ మాయమై॥ గజల్
దూరమవుతు బంధాలే ప్రేమతత్వం మాయమై॥
వయసుతేడా లేనె లేదు వావి వరుస లేనె లేవు
మృగాలుగ మారిపోతు మనిషితత్వం మాయమై ॥
ప్రజాసేవ పేరుకేగ వారిధనం దోచుకుంటు
రాజ్యమేలె స్వార్ధపరుల త్యాగతత్వం మాయమై॥
కోవెలలో అయినగాని నేతలకే దండమంటు
సామాన్యులు మౌనమాయె దైవతత్వం మాయమై ॥
మధుర'వాణి'అక్షరాలే అల్లుతోంది మార్పుకై
కోరుకుంటు పాలకులలొఆశతత్వం మాయమై ॥
......వాణి
No comments:
Post a Comment