Thursday, 19 November 2015

||గజల్ కాన్వాస్ ...32||

మనసుచూపు చిత్రాన్నీ చిత్రంగా గీస్తున్నా ||
మౌనమొలుకు భావాలను భాష్యంగా వ్రాస్తున్నా ||

ఊహలలొ ప్రపంచాన్ని వీక్షిస్తూ వున్నాలె
సడిచేయని సందడులే మౌనంగా చూస్తున్నా ||

కనులుతెరచి కలలెన్నో నిన్నుచూడ మనసౌతు
ఎదచాటులో అనుభూతులు కవనంగా రాస్తున్నా ||

సమీరమే ముంగురులను సవరించుకు వెళుతోంది
నీ ధ్యాసనే హృదయానికి సాంతంగా ఇస్తున్నా ||

నీ మమతల కలతలతో నిదురనోడు తున్నాను
కదలాడే కుంచెనెంతో చోద్యంగా చూస్తున్నా ||

శకుంతలా దుష్యంతుల ప్రణయసుధా భావాలె
మౌన‘వాణి' వాక్యలతో కావ్యంగా రాస్తున్నా ||

..వాణి, 10 nov 15
గజల్....

ప్రేమపంచు మనసులకై విశ్వమంత వెతకాలి ||
నిస్వార్ధపు మమతకొరకు గతమంతా వెతకాలి ||

నవ్వులన్ని నటనమౌతు మొహమాట రూపమౌతు
స్వచ్చమైన పలుకులకై లోకమంత వెతకాలి ||

మాసిపోయి మానవతే కనిపించక కరువౌతు
త్యాగమున్నజనాలకై జగమంతా వెతకాలి ||

ప్రసవించగ చెట్టునొకటి పుడమికెంత భారమో
విత్తునాటు మట్టికొరకు నేలంతా వెతకాలి ||

లెక్కలలో మిక్కిలైన జనులున్నా దేశంలో
మాటాడే చిరునవ్వుకై మనమంతా వెతకాలి ||

మారలేదు మగువబతుకు నిలదీస్తే నిందవేస్తు
గెలుపు'వాణి' గాధలెన్నొ చరిత్రంతా వెతకాలి ||
గజల్ కాన్వాస్ ...౩౩

నీ నవ్వుల మెరుపులలో నాకు చోటు ఇస్తావా ||
మధురూహల మౌనంలో నాకు చోటు ఇస్తావా ||

జలధారను పరికిణీగ చుట్టుకుంది నీవేనా?
కొత్తందపు రంగులలో నాకు చోటు ఇస్తావా ||

నీ పాదపు కదలికలలొ ఉల్లాసం చూస్తున్నా
ఆనందపు క్షణాలలొ నాకు చోటు ఇస్తావా ||

నీ చూపుల తాకిడిలో మనసుజార్చు కుంటున్నా
నీ లాస్యపు భంగిమలలొ నాకు చోటు ఇస్తావా ||

నీ వలువలు విసురుతున్న జడిలో నే మురుస్తున్న
తడుస్తున్న నీ తలపులొ నాకు చోటు ఇస్తావా ||

కదలాడే పెదవులలో ‘వాణి’ ఏదొ తెలుపవా?
ఆ పలుకుల పదనిధిలో నాకు చోటు ఇస్తావా ||

………..వాణి , 17 nov 15
|| మనసుకు భ్రమ నువ్వేనని...||

ఎవరినీడ ఎదురయినా మనసుకు భ్రమ నువ్వేనని ||
ఏ కదలిక కనపడినా మనసుకు భ్రమ నువ్వేనని ||

చింత ఎంతొ మదినిండా నీ జాడే తెలియకుండ
ఏ గొంతుక వినపడినా మనసుకు భ్రమ నువ్వేనని ||

చెప్పలేను నీ దూరం కష్టమెంతొ నా మనసుకు
ఏది తగిలి తడబడినా మనసుకు భ్రమ నువ్వేనని ||

తుడవలేక పోతున్నా ఒలుకుతున్న కన్నీటిని
ఏ రూపం తచ్చాడినా మనసుకు భ్రమ నువ్వేనని ||

కలనైనా నిజమునైన నన్నొదిలి పోవనుకుని
ఏ గాలీ స్పర్శించిన మనసుకు భ్రమ నువ్వేనని ||

మౌన’వాణి’ వేదనగా రాసుకుంటు భావాలే
ఏ ఉలుకుతొ తడబడినా మనసుకు భ్రమ నువ్వేనని ||

………..వాణి , 17 nov 15

గజల్..........

మమతలద్ది మానసాన్ని ఊరడించి పోరాదా ||
మదివాకిట ప్రేమసిరులు కురిపించీ పోరాదా ||

కంటిమెరుపు కానుకలే నా ముంగిట నిలిపుంచి
గతాలలో కాలాలను నిలువరించి పోరాదా ||

చూపులలో చిరునవ్వులు చిందలేక పోతున్నా
కేరింతల వరాలనే కుమ్మరించి పోరాదా ||

ఎదలోతున వేదనలే తమసులలో తడబాటులె
కల్లలైన కలలతోటి పలుకరించి పోరాదా ||

జ్ఞాపకాల గాయాలే సమ్మెటపొట్లౌతున్నవి
మరిపుఇచ్చు కానుకలతొ అనునయించి పోరాదా ||

మౌన’వాణి’ మదిలోతున విప్పలేని వేదనేదొ
ఆశ్చర్యపు ఆనందము వెల్లడించి పోరాదా ||
గజల్ ......

తన్మయమై పోతున్నది తలపులలో తడుస్తూ ||
అలలెన్నో హత్తుకుంది తీరాలలొ తడుస్తూ ||

కలహంసల నడకలలో ఇంపైనా అందాలే
ముసి ముసిగా ప్రియరాగం వలపులలో తడుస్తూ ||

సుగంధాల సమీరమే నన్నుతాకి వెళుతున్నది
పరిమళాల పులకింతలె ఉహలలో తడుస్తూ ||

మధురమనే నీ వాణీ మౌనంలో వింటున్నా
మదినేన్నో మెరుపుకలలు రాగాలలో తడుస్తూ ||

హరివిల్లులొ రంగులన్ని కలబోసిన చీర చుట్టి
వయారాల ప్రియభామిని జల్లులలో తడుస్తూ ||

నీ అందం అద్భుతమే కొత్తదనం వర్ణాలతొ
వస్త్రమేమో తనువుతాకి రంగులలో తడుస్తూ ||



Saturday, 14 November 2015

గజల్ ...............

ఎదచాటున చింతఏదొ చెప్పలేని జీవితం ||
మౌనంలో అలజడులను విప్పలేని జీవితం ||

స్వప్నంలో నవ్వులన్ని కవ్వింతగ మిగులుతూ
వేకువలో హసితాలను గెలవలేని జీవితం ||

ఊహలలో మెదులుతున్న మెరుస్తున్న నీ రూపం
సడలిపోయి కలలన్నీ అందలేని జీవితం ||

శ్వేతమబ్బు తరగలలో విహరిస్తూ వుంటావు
కనులముందు కదలాడిన చేరలేని జీవితం ||

నీ ఆలాపన 'వాణి'తొ తన్మయమై పోతున్నా
ఆశగానె మిగిలిపోయే పలుకులేని జీవితం ||

…...................వాణి 6 sep 15
గజల్ ...............

ఎదచాటున చింతఏదొ చెప్పలేని జీవితం ||
మౌనంలో అలజడులను విప్పలేని జీవితం ||

స్వప్నంలో నవ్వులన్ని కవ్వింతగ మిగులుతూ
వేకువలో హసితాలను గెలవలేని జీవితం ||

ఊహలలో మెదులుతున్న మెరుస్తున్న నీ రూపం
సడలిపోయి కలలన్నీ అందలేని జీవితం ||

శ్వేతమబ్బు తరగలలో విహరిస్తూ వుంటావు
కనులముందు కదలాడిన చేరలేని జీవితం ||

నీ ఆలాపన 'వాణి'తొ తన్మయమై పోతున్నా
ఆశగానె మిగిలిపోయే పలుకులేని జీవితం ||

…...................వాణి 6 sep 15
గజల్ ............
వేగిరమే రావయ్యా చిట్లి పోయె ధరణిచూడు ||
వరుణుదేవ పలుకరించు పగిలిపోయె పుడమిచూడు ||
కలుపుమొక్క కరువాయెను జంతుజాతి ఎండుతూ
తడిస్పర్శకు తొందరాయె చీలిపోయె నేలచూడు ||
కనులు తెరచి నేలతల్లి చూస్తున్నది నింగివైపు
చితికిపోయి బతుకులెన్నొ వలసపోయె దారిచూడు ||
మొలకెత్తగ విత్తులనే అవనికెంత ఆత్రమో
ఆలస్యము భారమౌతు తరలిపోయె రైతుచూడు ||
పాలుకారు పసి పిల్లలు బతుకువేట మొదలెట్టిరి
ఏలికలకు కానరాని తరలిపోయె జీవిచూడు ||
...…..వాణి, 14 oct 15
గజల్ ...........
చేజారిన కాలంలో కలతలెన్నొ దాగున్నవి ||
చెంపలపై చారికలలొ బాధలెన్నొ దాగున్నవి ||
స్వర్గ మైన బాల్యాలే జ్ఞాపకాల మాధుర్యం
అనుబంధపు ఆనవాళ్ళ గుర్తులెన్నొ దాగున్నవి ||
స్పర్శించే ప్రేమలకై తపియించే తనువులెన్నొ
ఎదలోతుల వేదనలో వ్యధలెన్నో దాగున్నవి ||
మదిలోతుల చిలుకుతున్న ఒలుకుతున్న గేయాలే
ఆంతర్యపు అక్షరాల్లొ విలువలెన్నొ దాగున్నవి ||
తీగతెగిన మదివీణియ పలుకుతున్న స్వరాలే
గాయపడ్డ గుండెలోతు స్పర్శలెన్నొ దాగున్నవి ||
చెమ్మగిల్లి కనులలోన దృష్టి అంద కున్నదీ
తడి చూపుల తడబాటులో చింతలెన్నొ దాగున్నవి ||
మౌన’వాణి’ ప్రకటించే స్పర్శించే భావాలు
తరలిపోయి క్షణాలలొ తపనలెన్నొ దాగున్నవి ||
.................వాణి,15 oct 15
గజల్.................
కనులనిండి సంతోషం నవ్వుతోంది కిలకిలమని ||
జాబిల్లీ నీజతగా వెలుగుతోంది మిలమిలమని ||
వీడిపోని ఆనందపు పరిమళమే నువ్వు కదా
నీ పలుకే పరవశించి ఒలుకుతోంది గలగలమని ||
చీకటిలో మిణుకువలే నీ వదనం మెరిపించెను
చందమామ నీతోడుగ నడుస్తోంది చకచకమని ||
మెరుపల్లే తళుకుమనే కాంతేదో ప్రసరించెను
నా మదిలో ఉల్లాసం పొంగుతోంది బిరబిర మని ||
మధుర’వాణి’ మదిలోతున మౌనాలే వీగిపొయె
నీ మాటల పరవశంతో నవ్వుతోంది పకపకమని ||
........వాణి , 19 oct 15
||: గజల్ కాన్వాస్ – 29:||:
కూలిపోయిన ప్రేమపందిరి నిలిచిపోతిమి పుడమిఒడిని ||
జన్మజగతిని వీడిపొతూ ఓడిపోతిమి వసుధఒడిని ||
జన్మజన్మల విడువలేని బంధమౌతూ మిగిలిపోయి
చావులోనూ మమైకమౌతూ కలసిపోతిమి అవనిఒడిని ||
చెట్టునీడన చెప్పుకున్నా ఊసులెన్నో బ్రతుకులో
సాక్ష్యమౌతూ ఎండుటాకుగ రాలిపోతిమి నేలఒడిని ||
పచ్చదనమే ఋజువుఅవుతూ ప్రేమగెలుపుకు నిదర్శనంగా
మృత్యుకౌగిట చేరిఒకటిగ మిగిలిపోతిమి ధాత్రిఒడిని ||
ధరణిగర్భం చేరదీసెను మమతనిండిన మనసులోకటిగ
ఆత్మలోకటిగ మౌన'వాణి'గ కలసిపోతిమి తరువుఒడిని ||
......వాణి , 20 oct 15
గజల్.....

గుర్తులలో గాయాలను తడుముకుంటు ఉన్నాను ||
జ్ఞాపకాల గాధలన్ని రాసుకుంటు ఉన్నాను ||

కాగితంపై అక్షరాలు మదిబాధలు పలుకరిస్తే
తిరిగిరాని కాలాలను తలచుకుంటు ఉన్నాను ||

గెలవలేని ఓటమినై వెంటపడగ నిరాశలు
రచియించిన కవనాలను చదువుకుంటు ఉన్నాను ||

మాసిపోక అలజడులే మౌనంగా మిగిలాను
బంధకాల బరువులను మోసుకుంటు ఉన్నాను ||

గతాలలో కలతలెన్నొ మనసునొప్పి పడుతుంటే
చెరపలేని ఎదలోతును నులుముకుంటు ఉన్నాను ||

మౌనాలను ఏలుకుంటు నా’వాణి’ని విప్పలేక
నిట్టూర్పుల తడులనెపుడు తుడుచుకుంటు ఉన్నాను ||

......వాణి , 21 oct 15
!! గజల్ !!

వేకువ పొద్దున విరిసే పువ్వుల అందము చూడూ ||
సుమములు ఒలికే మధురపు పరిమళ గంధము చూడూ ||

నిద్దుర చెలిమితొ మనసున మెరిసే కలలే ఎన్నో
స్వప్నపు గెలుపుతొ మోమున చిందే హాసము చూడూ ||

కులికే కన్నుల వదనం ఒలికే హావం భావం
పాటకు ధీటుగ పాదం పలికే లాస్యము చూడూ ||

తీరం తాకే కెరటం చెప్పే కధలే ఎన్నో
తరగల తపనతొ మనసున మెదిలే భావము చూడూ ||

ఋతువులు అన్నీ గ్రీష్మo అవుతూ మండే ఎండలు
మారని మనిషికి ప్రకృతి చెప్పే పాఠము చూడూ ||

మదిలో భావం అక్షర నిధులుగ 'వాణీ' మౌనం
పత్రము నిండిన జ్ఞాపక గాయపు కవనము చూడూ||

వాణి , 23 oct 15
గజల్..........
గెలుపుదిశలు వెతుక్కుంటు పరుగునై పోతాను ||
ఓడిపోక నేర్పుతోన వెలుగునై పోతాను ||
ఆశవిత్తు నాటుకుంటు సాధించె స్వప్నాన్నై
విజయాలను స్వాగతిస్తు మెరుపునై పోతాను ||
వెటకారపు మాటలన్నితుంచేస్తు సాగిపోతు
కలలన్నీ నెరవేర్చే గెలుపునై పోతాను ||
అలుపెరుగని అక్షరాల నిధులెన్నొ నింపుకుంటు
మౌన’వాణి’ భావాలకు తోడునై పోతాను ||
జ్ఞాపకంగ మిగిలిపోయె చిరునవ్వె జీవితాన
కాంతినింపు వేకువలో చూపునై పోతాను ||
...వాణి, 25 oct 15
:||: గజల్......:||:

ఎదురుచూపు నీ కోసం ఎదనిండీ ప్రేమలతో ||
చిరునవ్వులు నింపుకుని మదినిండీ ఆశలతో||

పచ్చచీర మెరుపులన్నినీవరముకె చూస్తుంటే
ఊహాలలొ ఆకాంక్షలు హృదినిండి భారాలతొ ||

పెదవంచున పలుకులన్ని వెలికిరాక వేచుండెను
ఆలస్యపు నిట్టూర్పులు గుండెనిండి నిరాశలతొ ||

చంద్రవంక నుదుటిపైన తిలకంగా దిద్దుకునీ
సౌందర్యపు వన్నెలద్ది మనసునిండి కోరిలతొ ||

సంధ్యపొద్దు అరుణిమలో నీ రాకడ వాంఛలెన్నొ
మనసులోన దాగుండిన మమతనిండి మధురిమలతొ ||

..........వాణి, 26 oct 15
గజల్............

చింతలనే చిరునవ్వుగ మార్చలేక పోతున్నా ||
తిమిరాలలో వెలుగుచుక్క అద్దలేక పోతున్నా ||

జ్ఞాపకాలు చీకట్లుగ గుండెలోన దాగుండి
భారమౌతు గురుతులన్ని మోయలేక పోతున్నా ||

నిశలలెన్నో జీవితాన నిధులుగానె మిగిలాయి
వేకువలో బతుకువెలుగు వెతకలేక పోతున్నా||

చూపుఎంత పారాడిన మిణుకువైన దొరకలేదు
నిట్టూర్పుల నవ్వులను దాచలేక పోతున్నా ||

చెంతచేరి వరములెన్నొ చేయివదలి వెళుతుంటే
అదృష్టపు అందాలను అందలేక పోతున్నా ||

మౌన'వాణి' మదివాకిట రాలుతున్న చినుకులెన్నొ
హృదయంలొ కలవరమును దాచలేక పోతున్నా ||

.........వాణి, 28 oct 15
గజల్ ....

తలవంచిన మౌనంలో తలపులెన్నొఉన్నవిలే ||
నేలతాకు చూపులలో సిగ్గులెన్నొ ఉన్నవిలే ||

పమిటచాటు నీ వదనం మరులుఒలుకు తున్నదీ
నిశ్శబ్దపు అందములో బాసలెన్నొ ఉన్నవిలే ||

మదినిండిన ఊహలన్ని కనులుచెప్పుతున్నాయి
చూపులొలుకు భావాలలొ తపనలెన్నో ఉన్నవిలే||

నీ నవ్వుల దీపాలలొ కాంతులన్ని నాకోసం
చెప్పలేని సౌందర్యపు తళుకులెన్నొ ఉన్నవిలే ||

మౌనవాణి పెదవిముడిలొ విప్పలేని పలుకులెన్నో
నా రాకల తహతహలో కలలెన్నో ఉన్నవిలే ||

....వాణి ,29 oct 15
గజల్...........

చీకటైనా వెలుగు ఐనా రోజులోనే ఉంటవీ ||
గెలుపు ఐనా ఓటమైనా నేర్పులోనే ఉంటవీ ||

భూమిపైనీ నీటినేగా మబ్బురాల్చే చినుకులూ
ఎక్కడెక్కడి జలములన్నీ నేలలోనే ఉంటవీ ||

అలసటన్నది మరచిపోదుము నిదురజగతిని ఏలుతూ
సుఖముఐనా స్వప్నమైనా నిదురలోనే ఉంటవీ ||

గాయమైనా గతముఐనా మిగిలిపోవును గుర్తుగా
అనుభూతులూ అనుభవాలూ బతుకులోనే ఉంటవీ ||

జన్మఎత్తిన ప్రాణికెల్లా ఎదురౌనులె కలతలెన్నొ
సౌఖ్యమైనా దు:ఖమైనా ఆత్మలోనే ఉంటవీ ||

నవ్వులోనూ బాధలోనూ నయనమొలుకును తడులనే
మనసుస్పందన ఋజువులన్నీ కనులులోనే ఉంటవీ ||

మౌన'వాణీ' మనసుగుచ్చుతు చెరిగిపోని చేదుగుర్తు
గాధలన్నీ గేయమౌతూ మనసులోనే ఉంటవీ ||

...వాణి , 29 oct 15
గజల్ కాన్వాస్ ...31
కనులలోన కాంతులేవొ నన్నుచూసి పిలిచాయి ||
సిగలోనీ విరులేగా నన్నుచూసి నవ్వాయి
నీ అందపు మెరుపులన్ని ముక్కెరతో నింపుకుని
కదలాడే ముంగురులే నన్నుచూసి ఎగిరాయి ||
నీ చూపుల నర్తనాలు ఒలుకుతున్న భావాలు
నీ రెప్పల రెపరెపలే నన్నుచూసి కులికాయి ||
కనుబొమ్మల నడుమనేమో చంద్రవంక దిద్దుకుని
క్రీగంటీ చూపులేవొ నన్నుచూసి మెరిశాయి ||
పడచుదనం పలుకరించి జావళీలు పాడింది
ఆలపించు ఆశలేవో నన్నుచూసి అడిగాయి ||
మౌనమైన మదిలోతుల నీ ‘వాణీ’ తెలియలేదు
మాటాడని పెదవులేగ నన్నుచూసి వణికాయి ||
........వాణి, 2 nov 15
|| గజల్ ||
చిరునవ్వుల దీపాలతొ మోముఎంత బాగున్నది ||
కులుకుతున్న ఓరచూపు అందమెంత బాగున్నది ||
నీ కనులలొ కలువరించు దాహాలే నింపుకుని
ఆరిపోని రెప్పచాటు ఆశఎంత బాగున్నది ||
ఎదురుచూచు బిడియాలలొ సొగసులెన్నొ చుస్తున్నా
నీ బుగ్గల సోట్టలలో సిగ్గుఎంత బాగున్నది ||
వేచిచూచు ఆలస్యపు అలసటేది కనపడక
చెరిగిపోని సౌందర్యపు ఓర్పుఎంత బాగున్నది ||
నిట్టూర్చక విరులుకూడ వడలిపోక వేచుండి
పరిమళించు సుమాలలో సోకుఎంత బాగున్నది ||
మదురమైన మదిభావన నీ ‘వాణీ. మనోహరం
ప్రేమనిండి హృదయంలొ పలుకుఎంత బాగున్నది ||
||గజల్ కాన్వాస్ ...32||
మనసుచూపు చిత్రాన్నీ చిత్రంగా గీస్తున్నా ||
మౌనమొలుకు భావాలను భాష్యంగా వ్రాస్తున్నా ||
ఊహలలొ ప్రపంచాన్ని వీక్షిస్తూ వున్నాలె
సడిచేయని సందడులే మౌనంగా చూస్తున్నా ||
కనులుతెరచి కలలెన్నో నిన్నుచూడ మనసౌతు
ఎదచాటులో అనుభూతులు కవనంగా రాస్తున్నా ||
సమీరమే ముంగురులను సవరించుకు వెళుతోంది
నీ ధ్యాసనే హృదయానికి సాంతంగా ఇస్తున్నా ||
నీ మమతల కలతలతో నిదురనోడు తున్నాను
కదలాడే కుంచెనెంతో చోద్యంగా చూస్తున్నా ||
శకుంతలా దుష్యంతుల ప్రణయసుధా భావాలె
మౌన‘వాణి' వాక్యలతో కావ్యంగా రాస్తున్నా ||
..వాణి, 10 nov 15
గజల్......
భూమిఎండి దాహంతో మింటినీరు అడుగుతోంది ||
గుండెలోన గాయమొకటి కంటినీరు అడుగుతోంది ||
విత్తులనే మొలకెత్తగ తడిమట్టికి వేచిచూస్తు
పొడి బారిన మట్టికణం మబ్బు నీరు అడుగుతోంది ||
పరిమళించ నేలకూడ వర్షాన్నే కోరుకుంటు
జల్లురాల్చ మేఘమొకటి కడలినీరు అడుగుతోంది ||
శిశిరంలో చెట్లు అన్ని ఆకురాల్చి మోడౌతూ
తరువేమో వరుణుడినే వాన నీరు అడుగుతోంది ||
తలపులలో తడిఏదో మనసులోతు స్పర్శిస్తూ
హసితాలను స్వాగతిస్తు కనులనీరు అడుగుతోంది ||
.........వాణి/ 13/11/15
గజల్....

ప్రేమపంచు మనసులకై విశ్వమంత వెతకాలి ||
నిస్వార్ధపు మమతకొరకు గతమంతా వెతకాలి ||

నవ్వులన్ని నటనమౌతు మొహమాట రూపమౌతు
స్వచ్చమైన పలుకులకై లోకమంత వెతకాలి ||

మాసిపోయి మానవతే కనిపించక కరువౌతు
త్యాగమున్నజనాలకై జగమంతా వెతకాలి ||

ప్రసవించగ చెట్టునొకటి పుడమికెంత భారమో
విత్తునాటు మట్టికొరకు నేలంతా వెతకాలి ||

లెక్కలలో మిక్కిలిన జనులున్నా దేశంలో
మాటాడే చిరునవ్వుకై మనమంతా వెతకాలి ||

మారలేదు మగువబతుకు నిలదీస్తే నిందవేస్తు
గెలుపు'వాణి' గాధలెన్నొ చరిత్రంతా వెతకాలి ||