Saturday, 14 November 2015

గజల్ ....

తలవంచిన మౌనంలో తలపులెన్నొఉన్నవిలే ||
నేలతాకు చూపులలో సిగ్గులెన్నొ ఉన్నవిలే ||

పమిటచాటు నీ వదనం మరులుఒలుకు తున్నదీ
నిశ్శబ్దపు అందములో బాసలెన్నొ ఉన్నవిలే ||

మదినిండిన ఊహలన్ని కనులుచెప్పుతున్నాయి
చూపులొలుకు భావాలలొ తపనలెన్నో ఉన్నవిలే||

నీ నవ్వుల దీపాలలొ కాంతులన్ని నాకోసం
చెప్పలేని సౌందర్యపు తళుకులెన్నొ ఉన్నవిలే ||

మౌనవాణి పెదవిముడిలొ విప్పలేని పలుకులెన్నో
నా రాకల తహతహలో కలలెన్నో ఉన్నవిలే ||

....వాణి ,29 oct 15

No comments:

Post a Comment