Saturday, 14 November 2015

గజల్.....

గుర్తులలో గాయాలను తడుముకుంటు ఉన్నాను ||
జ్ఞాపకాల గాధలన్ని రాసుకుంటు ఉన్నాను ||

కాగితంపై అక్షరాలు మదిబాధలు పలుకరిస్తే
తిరిగిరాని కాలాలను తలచుకుంటు ఉన్నాను ||

గెలవలేని ఓటమినై వెంటపడగ నిరాశలు
రచియించిన కవనాలను చదువుకుంటు ఉన్నాను ||

మాసిపోక అలజడులే మౌనంగా మిగిలాను
బంధకాల బరువులను మోసుకుంటు ఉన్నాను ||

గతాలలో కలతలెన్నొ మనసునొప్పి పడుతుంటే
చెరపలేని ఎదలోతును నులుముకుంటు ఉన్నాను ||

మౌనాలను ఏలుకుంటు నా’వాణి’ని విప్పలేక
నిట్టూర్పుల తడులనెపుడు తుడుచుకుంటు ఉన్నాను ||

......వాణి , 21 oct 15

No comments:

Post a Comment