గజల్......
భూమిఎండి దాహంతో మింటినీరు అడుగుతోంది ||
గుండెలోన గాయమొకటి కంటినీరు అడుగుతోంది ||

విత్తులనే మొలకెత్తగ తడిమట్టికి వేచిచూస్తు
పొడి బారిన మట్టికణం మబ్బు నీరు అడుగుతోంది ||

పరిమళించ నేలకూడ వర్షాన్నే కోరుకుంటు
జల్లురాల్చ మేఘమొకటి కడలినీరు అడుగుతోంది ||

శిశిరంలో చెట్లు అన్ని ఆకురాల్చి మోడౌతూ
తరువేమో వరుణుడినే వాన నీరు అడుగుతోంది ||

తలపులలో తడిఏదో మనసులోతు స్పర్శిస్తూ
హసితాలను స్వాగతిస్తు కనులనీరు అడుగుతోంది ||

.........వాణి/ 13/11/15
No comments:
Post a Comment