Saturday, 14 November 2015

గజల్.................
కనులనిండి సంతోషం నవ్వుతోంది కిలకిలమని ||
జాబిల్లీ నీజతగా వెలుగుతోంది మిలమిలమని ||
వీడిపోని ఆనందపు పరిమళమే నువ్వు కదా
నీ పలుకే పరవశించి ఒలుకుతోంది గలగలమని ||
చీకటిలో మిణుకువలే నీ వదనం మెరిపించెను
చందమామ నీతోడుగ నడుస్తోంది చకచకమని ||
మెరుపల్లే తళుకుమనే కాంతేదో ప్రసరించెను
నా మదిలో ఉల్లాసం పొంగుతోంది బిరబిర మని ||
మధుర’వాణి’ మదిలోతున మౌనాలే వీగిపొయె
నీ మాటల పరవశంతో నవ్వుతోంది పకపకమని ||
........వాణి , 19 oct 15

No comments:

Post a Comment