Saturday, 14 November 2015

!! గజల్ !!

వేకువ పొద్దున విరిసే పువ్వుల అందము చూడూ ||
సుమములు ఒలికే మధురపు పరిమళ గంధము చూడూ ||

నిద్దుర చెలిమితొ మనసున మెరిసే కలలే ఎన్నో
స్వప్నపు గెలుపుతొ మోమున చిందే హాసము చూడూ ||

కులికే కన్నుల వదనం ఒలికే హావం భావం
పాటకు ధీటుగ పాదం పలికే లాస్యము చూడూ ||

తీరం తాకే కెరటం చెప్పే కధలే ఎన్నో
తరగల తపనతొ మనసున మెదిలే భావము చూడూ ||

ఋతువులు అన్నీ గ్రీష్మo అవుతూ మండే ఎండలు
మారని మనిషికి ప్రకృతి చెప్పే పాఠము చూడూ ||

మదిలో భావం అక్షర నిధులుగ 'వాణీ' మౌనం
పత్రము నిండిన జ్ఞాపక గాయపు కవనము చూడూ||

వాణి , 23 oct 15

No comments:

Post a Comment