Thursday, 19 November 2015

గజల్..........

మమతలద్ది మానసాన్ని ఊరడించి పోరాదా ||
మదివాకిట ప్రేమసిరులు కురిపించీ పోరాదా ||

కంటిమెరుపు కానుకలే నా ముంగిట నిలిపుంచి
గతాలలో కాలాలను నిలువరించి పోరాదా ||

చూపులలో చిరునవ్వులు చిందలేక పోతున్నా
కేరింతల వరాలనే కుమ్మరించి పోరాదా ||

ఎదలోతున వేదనలే తమసులలో తడబాటులె
కల్లలైన కలలతోటి పలుకరించి పోరాదా ||

జ్ఞాపకాల గాయాలే సమ్మెటపొట్లౌతున్నవి
మరిపుఇచ్చు కానుకలతొ అనునయించి పోరాదా ||

మౌన’వాణి’ మదిలోతున విప్పలేని వేదనేదొ
ఆశ్చర్యపు ఆనందము వెల్లడించి పోరాదా ||

No comments:

Post a Comment