గజల్...........
చీకటైనా వెలుగు ఐనా రోజులోనే ఉంటవీ ||
గెలుపు ఐనా ఓటమైనా నేర్పులోనే ఉంటవీ ||
గెలుపు ఐనా ఓటమైనా నేర్పులోనే ఉంటవీ ||
భూమిపైనీ నీటినేగా మబ్బురాల్చే చినుకులూ
ఎక్కడెక్కడి జలములన్నీ నేలలోనే ఉంటవీ ||
ఎక్కడెక్కడి జలములన్నీ నేలలోనే ఉంటవీ ||
అలసటన్నది మరచిపోదుము నిదురజగతిని ఏలుతూ
సుఖముఐనా స్వప్నమైనా నిదురలోనే ఉంటవీ ||
సుఖముఐనా స్వప్నమైనా నిదురలోనే ఉంటవీ ||
గాయమైనా గతముఐనా మిగిలిపోవును గుర్తుగా
అనుభూతులూ అనుభవాలూ బతుకులోనే ఉంటవీ ||
అనుభూతులూ అనుభవాలూ బతుకులోనే ఉంటవీ ||
జన్మఎత్తిన ప్రాణికెల్లా ఎదురౌనులె కలతలెన్నొ
సౌఖ్యమైనా దు:ఖమైనా ఆత్మలోనే ఉంటవీ ||
సౌఖ్యమైనా దు:ఖమైనా ఆత్మలోనే ఉంటవీ ||
నవ్వులోనూ బాధలోనూ నయనమొలుకును తడులనే
మనసుస్పందన ఋజువులన్నీ కనులులోనే ఉంటవీ ||
మనసుస్పందన ఋజువులన్నీ కనులులోనే ఉంటవీ ||
మౌన'వాణీ' మనసుగుచ్చుతు చెరిగిపోని చేదుగుర్తు
గాధలన్నీ గేయమౌతూ మనసులోనే ఉంటవీ ||
గాధలన్నీ గేయమౌతూ మనసులోనే ఉంటవీ ||
...వాణి , 29 oct 15
No comments:
Post a Comment