గజల్ కాన్వాస్ ...31
కనులలోన కాంతులేవొ నన్నుచూసి పిలిచాయి ||
సిగలోనీ విరులేగా నన్నుచూసి నవ్వాయి
సిగలోనీ విరులేగా నన్నుచూసి నవ్వాయి
నీ అందపు మెరుపులన్ని ముక్కెరతో నింపుకుని
కదలాడే ముంగురులే నన్నుచూసి ఎగిరాయి ||
కదలాడే ముంగురులే నన్నుచూసి ఎగిరాయి ||
నీ చూపుల నర్తనాలు ఒలుకుతున్న భావాలు
నీ రెప్పల రెపరెపలే నన్నుచూసి కులికాయి ||
నీ రెప్పల రెపరెపలే నన్నుచూసి కులికాయి ||
కనుబొమ్మల నడుమనేమో చంద్రవంక దిద్దుకుని
క్రీగంటీ చూపులేవొ నన్నుచూసి మెరిశాయి ||
క్రీగంటీ చూపులేవొ నన్నుచూసి మెరిశాయి ||
పడచుదనం పలుకరించి జావళీలు పాడింది
ఆలపించు ఆశలేవో నన్నుచూసి అడిగాయి ||
ఆలపించు ఆశలేవో నన్నుచూసి అడిగాయి ||
మౌనమైన మదిలోతుల నీ ‘వాణీ’ తెలియలేదు
మాటాడని పెదవులేగ నన్నుచూసి వణికాయి ||
మాటాడని పెదవులేగ నన్నుచూసి వణికాయి ||
........వాణి, 2 nov 15
No comments:
Post a Comment