Thursday, 19 November 2015

||గజల్ కాన్వాస్ ...32||

మనసుచూపు చిత్రాన్నీ చిత్రంగా గీస్తున్నా ||
మౌనమొలుకు భావాలను భాష్యంగా వ్రాస్తున్నా ||

ఊహలలొ ప్రపంచాన్ని వీక్షిస్తూ వున్నాలె
సడిచేయని సందడులే మౌనంగా చూస్తున్నా ||

కనులుతెరచి కలలెన్నో నిన్నుచూడ మనసౌతు
ఎదచాటులో అనుభూతులు కవనంగా రాస్తున్నా ||

సమీరమే ముంగురులను సవరించుకు వెళుతోంది
నీ ధ్యాసనే హృదయానికి సాంతంగా ఇస్తున్నా ||

నీ మమతల కలతలతో నిదురనోడు తున్నాను
కదలాడే కుంచెనెంతో చోద్యంగా చూస్తున్నా ||

శకుంతలా దుష్యంతుల ప్రణయసుధా భావాలె
మౌన‘వాణి' వాక్యలతో కావ్యంగా రాస్తున్నా ||

..వాణి, 10 nov 15

No comments:

Post a Comment