Saturday, 14 November 2015

|| గజల్ ||
చిరునవ్వుల దీపాలతొ మోముఎంత బాగున్నది ||
కులుకుతున్న ఓరచూపు అందమెంత బాగున్నది ||
నీ కనులలొ కలువరించు దాహాలే నింపుకుని
ఆరిపోని రెప్పచాటు ఆశఎంత బాగున్నది ||
ఎదురుచూచు బిడియాలలొ సొగసులెన్నొ చుస్తున్నా
నీ బుగ్గల సోట్టలలో సిగ్గుఎంత బాగున్నది ||
వేచిచూచు ఆలస్యపు అలసటేది కనపడక
చెరిగిపోని సౌందర్యపు ఓర్పుఎంత బాగున్నది ||
నిట్టూర్చక విరులుకూడ వడలిపోక వేచుండి
పరిమళించు సుమాలలో సోకుఎంత బాగున్నది ||
మదురమైన మదిభావన నీ ‘వాణీ. మనోహరం
ప్రేమనిండి హృదయంలొ పలుకుఎంత బాగున్నది ||

No comments:

Post a Comment