గజల్ .......
ధనముకాంక్షకు దప్పికైతే నీతిఎక్కడ నిలువగలదూ ||
మానవతకే మరకలైతే మంచిఎక్కడ నిలువగలదూ ||
మానవతకే మరకలైతే మంచిఎక్కడ నిలువగలదూ ||
.
అందమైనది ఆర్తిగీతం ఙ్ఞాపకాలను విప్పుతున్నది
మధురభావం పలుకుతుంటే గాయమెక్కడ నిలువగలదూ ||

కంటిపాపకు చింతలెన్నో దయేలేనివి చూపులన్నీ
వెండివెన్నెల పలుకరిస్తే చీకటెక్కడ నిలువగలదూ ||

విప్పలేనివి పెదవిముడులే అక్షరాలలో దుఃఖచరితలు
మధురవాణీ మౌనసంపద భావమెక్కడ నిలువగలదూ ||

మాటలన్నీ మనసుమాటున నిశ్శబ్దమే ఏలుతున్నది
సంతసాలే స్వాగతిస్తే శోకమెక్కడ నిలువగలదూ ||

తరచిచూచే తప్పులెన్నో ఎత్తిపొడుపుల నిందలెన్నో
ప్రహసనాలే నిత్యమైతే చెలిమిఎక్కడ నిలువగలదూ ||

ఇంకిపోవవి కంటితడులే ఆశచూపులు ఓడిపోతూ
అంతులేనిది వేదనైతే హాసమెక్కడ నిలువగలదూ ||

విజయతీరం చేరుకోవా సంకల్పమే చెంత వుంటే
సాధనే ఒక ధ్యేయమైతే ఓటమెక్కడ నిలువగలదూ ||

........వాణి, 2 Sep 16
........వాణి, 2 Sep 16
No comments:
Post a Comment