Thursday, 3 November 2016

ఙ్ఞాపకాల గుండెలోన నవ్వుతూనె ఉంటావు ||
కలతగాను ఎదలోతున మెదులుతూనె ఉంటావు ||

సర్దుమణిగి స్వప్నాలే శూన్యంలో నిలిచాయి
చీకటిలో కన్నీటిగ రాలుతూనె ఉంటావు ||

కనుపాపల కలవరింత ఎదురుచూపు ఆశల్లో
వేలాడే చిత్రంలో కదులుతూనె ఉంటావు ||

ఊహలలో ఉంటావా  ఉనికిచాటు తుంటావు
ఉలికిపాటు తడబాటులో తడుముతూనె ఉంటావు ||

మౌనవాణి భావాలలొ తడిఅక్షర మయ్యావు
నిశ్శబ్దపు రాగాలను పాడుతూనె ఉంటావు ||

వెన్నెలతో ఊసులాడి ఓడిపోతు ఉన్నాను
నా వెనుకే నీ అడుగులు చాటుతూనె ఉంటావు ||

.........వాణి, 02 Nov 16

No comments:

Post a Comment