గజల్ .......
కాలానికి కొత్తబాట వేయుచున్న వారెవ్వరు ||
వేకువలను చీకట్లను మార్చుతున్న వారెవ్వరు ||
వేకువలను చీకట్లను మార్చుతున్న వారెవ్వరు ||
మధురమైన భావనతో మానసమే మురిసిపోయె
మనసంతా తలపులతో తడుముతున్న వారెవ్వరు ||
నిశిరాత్రిని నిలదీశా నిష్క్రమించి వెళ్ళమంటు
రేతురులకు చరమగీతి పాడుతున్న వారెవ్వరు ||
అలలనెంతొ ఆత్రంగా అడగాలని అనుకున్నా
విసుగులేని పోరాటం సలుపుతున్న వారెవ్వరు ||
పారాడే క్షణాలన్ని మోయలేని భారాలే
నా అడుగుకు నడకలనే నేర్పుతున్న వారెవ్వరు ||
గుర్తులెన్నొ గుండెల్లో ఎదురొచ్చే ఆనవాళ్ళు
కవనానికి సంగతులను నేర్పుతున్న వారెవ్వరు ||
మౌనవాణి ఒలికించే చెమరించే అక్షరాలు
ఎదలోతుల ఆవేదన తడుపుతున్న వారెవ్వరు ||
......వాణి, 04 Nov 16

No comments:
Post a Comment