గజల్ ........
.
చూపులు కురిసే మమతల భాషను కంటవి కన్నులు ||
మదిలో భావం మౌనం గానే మోస్తవి కన్నులు ||
నయన పుటములో ముసిరే వున్నవి కలతలు ఎన్నో
ఉసూరు మంటూ ఊహల కథలే చెప్తవి కన్నులు ||
వాణివి కలలే చెదిరి పోయెనా నిర్లిప్తంగా
ఆనవాళ్ళలో చరిత్ర గాధలు వింటవి కన్నులు ||
విషాద గీతం తాత్వికమైనది ఆలాపిస్తే
అనుభవ పాఠం గుండెలొగాయం చూస్తవి కన్నులు ||
మూగగ మనసున దాగి వుండెనా మర్మా లెన్నో
చెలిమి చేతిలా ప్రేమ స్పర్శలా దాస్తవి కన్నులు ||
కంటిపాపలో దాగి వుండెనా గుర్తులు ఎన్నో
చింతలు వేసే చీకటి ప్రశ్నల ఉంటవి కన్నులు ||
కనులే చెప్పెడి బోధనలెన్నో కన్నీరౌతూ
రెప్పల తెరలే కప్పి వుంచుతూ మూస్తవి కన్నులు ||
.......వాణి, 28 Oct 16

No comments:
Post a Comment